/rtv/media/media_files/2025/04/16/uvcSKK6iVRVAYFM7nCSt.jpg)
JD vance
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.
Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి
Office of US Vice President JD Vance issues a statement announcing Vice President JD Vance and the Second Family's visit to Italy and India from April 18 to April 24. The Vice President will discuss shared economic and geopolitical priorities with leaders in each country... In… pic.twitter.com/XNl5Q2oyTi
— ANI (@ANI) April 16, 2025
ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.
Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు