Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది.

New Update
Canada students

Canada students Photograph: (Canada students)

ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది. 2024 లో ఈ మూడుదేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్‌ వీసాల్లో 25 శాతం తగ్గుముఖం పట్టాయి.

కెనడాకు వెళ్లే వారి సంఖ్యలో 32 శాతం తగ్గినట్లు తెలుస్తుంది.ఇది2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు చేరుకొంది.ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌ ,రెప్యూజీస్ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడాసంస్థ వెల్లడించింది.

Also Read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం

Indian Students - Abroad

అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం పడిపోయింది.దీంతో 2024 లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఎఫ్‌ 1 వీసాల్లో 1,31,000 నుంచి 86,000 కు తగ్గుదల నమోదైంది.యూకే కు వెళ్లే వారి సంఖ్యలో 26 శాతం తగ్గుదల కనిపించింది. అంతకు ముందు ఏడాది 1,20,000 విద్యార్థి వీసాలు ఉండగా..తాజాగా యూకే హోమ్‌ ఆఫీస్‌ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732 కు తగ్గాయి.

ముఖ్యంగా కెనడా,యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి కారణం అయ్యాయి. కెనడా-భారత్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంకూడాఈ పరిస్థితి తోడైంది. ముఖ్యంగా ఆ దేశంలో  భారతీయ విద్యార్థుల పై పలు ఆంక్షలువిధించింది.

స్టూడెంట్‌  డైరెక్ట్‌ స్ట్రీమ్‌ప్రొగ్రామ్‌ ను వేగవంతం చేసింది. దీంతో పాటు తమ దేశంలో తాత్కాలికంగా నివసించే విదేశీయ సంఖ్యను 2026 నాటికి 5 శాతానికి తగ్గించాలన్న నిర్ణయం ప్రభావం కూడా ఉంది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటంతో ఆరోగ్య,గృహ,ఇతర ప్రజాసేవలకు భారంగా మారుతోందన్న కారణాన్ని కెనడా వివరిస్తోంది.

Also Read:భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32శాతం తగ్గించింది.అదే సమయంలో చైనీయులకు కేవలం 3 శాతం కుదించింది.ఇక యూకే కూడా విదేశీ విద్యార్థులు వారి పై ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈకారణంతో ఆ దేశానికి వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి కొవిడ్‌ తర్వాత 2023నుంచే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం తగ్గించింది.

ఆ ఏడాది 13శాతం తగ్గుదల కనిపించింది.ఇక 2024లో అది26శాతానికి పరిమితమైంది. గత పదేళ్లలో  ఈ మూడుదేశాల్లో భారతీయ విద్యార్థులు సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థులను వీరు దాటేశారు. 2015 నుంచి 23 మధ్య కెనడా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 31,920 నుంచి 2,78,160 కి చేరుకుంది.

ఇదే కాలంలో యూకేకు వెళ్లే వారి సంఖ్య 10,418 నుంచి 1,19,738 చేరుకుంది.అగ్రరాజ్యానకిఇ 2015లో 74,831 మంది ఎఫ్‌1 వీసా పై వెళ్లగా..2023లో అది 1,30,730 గా ఉంది.

Also Read: Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

Also Read:Nashik Dargah : నాసిక్లో దర్గా కూల్చివేత.. 21 మంది పోలీసులకు గాయాలు!

 

uk | canada | america | visa | h1b | students | national | international | latest-telugu-news | latest telugu news updates | telugu-news | latest-news | indian-students 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు