/rtv/media/media_files/2025/03/14/QFDFYAcLiJGxaRBBdCwP.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా డ్రొనాల్డ్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచదేశాలకు చుక్కులు చూపిస్తున్నాడు. ట్రంప్ తన నిర్ణయాలతో షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఆయన అనుహ్య నిర్ణయాల కారణంగా చాలామంది బలవుతున్నారు. ముఖ్యంగా ఇండియాపై అమెరికా తీసుకునే నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇండియా నా ఫ్రెండ్ అంటూనే భారతీయ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టే నిర్ణయాలు తీసుకున్నాడు.
అక్రమ వలసదారులంటూ నిన్న మొన్నటిదాక మెడబట్టుకొని అమెరికా నుంచి వేల మందిని బయటకు పంపాడు ట్రంప్. అమెరికాలో ఉన్న విదేశీలను ఎలాగైనా బయటకు పంపాలని మరో కొత్తప్లాన్‌తో వచ్చాడు. అదేంటంటే.. ఆ దేశంలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు కాలేజీ మానేసినా, క్లాస్‌లకు అటెండ్ కాకున్నా హాజరుశాతం లేకున్నా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా.. వారి వీసాలు రద్దు చేస్తామని ప్రకటించింది.
Also Read : క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?
క్లాస్‌కు వెళ్లకుంటే వీసా క్యాన్సిల్
న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటన చేసింది. అమెరికాలో చదువుకొనేందుకు వచ్చిన విదేశీ విద్యార్థులందరూ తమ విద్యార్థి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా విద్యార్థి హోదాను కొనసాగించాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, స్టడీ ప్రోగ్రామ్ నుంచి వైదొలగినా మీ విద్యార్థి వీసాను రద్దు చేస్తాం. అంతే కాదు భవిష్యత్తులో అమెరికా వీసాలు పొందే అర్హతను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నంత కాలం మీ వీసా నిబంధనలకు కట్టుబడి ఉండండని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది. దీంతో అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వారిలో 90శాతం మంది విద్యార్థులు ఏదో ఒక పార్ట్‌టైం పని చేసుకుంటూనే మాస్టర్స్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ కొత్త నిబంధలు పెడితే అక్కడున్న ఫారెన్ స్టూడెంట్ ఇరకాటంలో పడతారు. ఖర్చులకు డబ్బులేకున్నా ఖచ్చితంగా కాలేజ్‌కి వెళ్లి క్లాస్ అటెండ్ అవ్వాల్సిందే. అమెరికాలో ఉన్న ఫారెన్ స్టూడెంట్లు 60శాతం కంటే ఎక్కువ ఇండియా నుంచి వెళ్లిన వారే. ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయంతో వారు అయోమయంలో పడిపోయారు. ఇండియాపై ప్రభావం చూపిన ట్రంప్ మరికొన్ని నిర్ణయాలు ఇప్పడు మనం చూద్దాం..
Also Read : జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
హార్వార్డ్ యూనివర్సిటీపై కొరడా
హార్వడ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్ధులను చేర్చుకోవడంపై నిషేధం విధించాడు ట్రంప్. యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడంతోపాటు, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసారు ట్రంప్. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. హార్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఏటా సుమారు 500- నుంచి 800 మంది భారత విద్యార్థులు, పరిశోధకులు చేరుతున్నారు. ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్‌లో చదువుతున్నారు.
విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్
ఇతర దేశాల్లో తీసిన సినిమాలు అమెరికా థియేటర్‌లో ఆడాలంటే 100శాతం పన్ను కట్టాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై ప్రభావం పడనుంది. ఇండియాలో తీసిన సినిమాలు అమెరికాలో చాలా క్రేజ్ ఉంటుంది. వేలు వేలు పెట్టి అయినా సరే అక్కడున్న వారు ఇండియన్ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు. అమెరికాకు సినిమాలను ఎగుమతి చేసే భారతీయ సినీ పరిశ్రమలలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అగ్రస్థానంలో ఉంటాయి. ట్రంప్ విధించిన వంద శాతం పన్ను అమలైతే ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు ఇబ్బందులే. ఇటీవల కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ కనిపిస్తోంది.
పఠాన్, డంకీ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, జవాన్‌లాంటి భారతీయ చిత్రాలు వసూళ్లలో రికార్డులు బద్దలుకొట్టాయి. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి అమెరికాకు మధ్య బలమైన డిస్ట్రబూషన్ సిస్టమ్ ఏర్పడింది. ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్ అమలుచేస్తే భారతీయ సినిమాలను కొనుగోలు చేయడం అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లకు అదనపు భారమవుతుంది. ఉదాహరణకు ఇప్పటివరకూ ఒక ఇండియన్ మూవీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కోసం ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.4 కోట్లు) చెల్లించిన అమెరికా డిస్ట్రిబ్యూటర్ ఇకపై అదనంగా మరో రూ. 8.4 కోట్లు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : రైతులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
విదేశీ కార్లపై 25 శాతం సుంకం
అమెరికాలో తయారు కాని కార్లపై 25 శాతం ట్యాక్స్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సుంకాలు అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమను బలోపేతం చేయడానికీ, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి. అయితే, ఈ నిర్ణయం భారతదేశంతో సహా అనేక దేశాలపై ప్రభావం చూపనుంది. భారత్ నుంచి అమెరికాకు వాహన ఎగుమతులు పెద్దగా లేనప్పటికీ, ఆటో భాగాలు, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులపై ఈ సుంకాలు ప్రభావం చూపవచ్చు. 2024 డేటా ప్రకారం భారతదేశం అమెరికాకు దాదాపు 59.93 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను చేస్తోంది. ఈ సుంకాల వల్ల భారత ఎగుమతులు 2 నుంచి 7 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. దీని వల్ల భారత జీడీపీ వృద్ధి 5-10 బేసిస్ పాయింట్ల మేర తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాపిల్, సామ్‌సంగ్ కంపెనీలకు వార్నింగ్
ఇండియాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి యాపిల్ కంపెనీ ఉత్పత్తులు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన సుంకాల మోతతో టిమ్‌కుక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. విదేశాల్లో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్మితే 25శాతం పన్ను విధిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికాలో విక్రయించే యాపిల్ ఉత్పత్తులు స్థానికంగానే తయారు చేయాలన్నారు. భారత్ లేదా మరే దేశంలో తయారు చేయొద్దని.. అలా చేస్తే కనీసం 25శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే తరహాలో సామ్‌సంగ్ కంపెనీని కూడా ట్రంప్ హెచ్చరించాడు. ఇది ఇండియా ఉత్పదకతను దెబ్బతీసింది. ఆయా కంపెనీలు ఇండియాకు వస్తే ఉపాది లభించేది. ట్రంప్ తీరుతో ఇండియాకు దెబ్బే.
Also Read : మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!
ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించాలని ఆయన సూచించారు. ఈ కొత్త రెమిటెన్స్ పన్ను ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో బిల్లుగా ప్రవేశపెడతారు. ఇది అమల్లోకి వస్తే, అమెరికాలో పనిచేస్తున్న H-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కలిగినవారు, NRIలు తాము పంపే డబ్బుపై 5 శాతం అదనపు భారం మోపాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, విద్య, వైద్య ఖర్చుల కోసం తమ దేశానికి డబ్బు పంపే NRIలపై భారీగా భారం పడనుంది.
us | trump | 47th us president donald trump | america president donald trump | america | trump tariff war | trump tariffs india | donald trump tariffs | tax