/rtv/media/media_files/2025/05/28/EKRECqCRyxEqH87o2z26.jpg)
Ray Kurzweil Photograph: (Ray Kurzweil)
నానోబోట్‌ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ చెప్పారు. నానో టెక్నాలజీ అద్భుతాలు చేస్తుందని, నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయంటున్నారు. ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని తెలిపారు.
వృద్ద్యాప్యం, మరణం లేదు..
ఈ మేరకు అధిక బరువు పెరగకుండా ఆహార నియమాలను పాటించేలా నానోబోట్ లు గైడ్ చేస్తాయని చెబుతున్నారు. సాంకేతిక అంచనాల్లో కచ్చితత్వం కలిగిన శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆయన.. జన్యుశాస్త్రం, రోబోటిక్స్, అట్లనే ఏఐ (AI) లను కీలక డ్రైవర్లు(Key Drivers)గా పేర్కొన్నారు. 2005లో కుర్జ్ వీల్ రాసిన ‘The Singularity Is Near’ పుస్తకంలోనూ మానవుని భవిష్యత్ సాంకేతికత గురించి ప్రస్తావించగా.. ఇప్పుడు ఆయన చెప్పిన నానోబోట్స్ అంశం చర్చనీయాంశమైంది. ఈ ప్రకటన నమ్మశక్యంగా లేనప్పటికీ గుడ్డిగా కొట్టిపారేసేలా లేదు. 'జన్యుశాస్త్రం, రోబోటిక్స్ వంటి కీలకమైన శాస్త్రీయ విభాగాలలో వేగవంతమైన పురోగతి ఈ నానోటెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. నానోబోట్‌లు అని పిలువబడే సూక్ష్మ యంత్రాల ఆవిర్భావం ద్వారా వైద్యం, భవిష్యత్తు గుర్తించగలమని కుర్జ్‌వీల్ అంచనా వేస్తున్నారు. ఇలాంటి చిన్న రోబోలు మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రయాణించడానికి సహాయపడతాయి. శరీర స్థితిని నిరంతరం పరిశీలిస్తూ చికిత్స అందిస్తాయి. వృద్ధాప్య లక్షణాలు, కణాలను తిప్పికొడతాయి. శరీరంలో వ్యాధుల లక్షణాలు కనిపించగానే వాటిని నయం చేయడమే కాకుండా మానవ శరీరాన్ని సెల్యులార్ స్థాయిలో పునరుద్ధరించగలవు. వృద్ధాప్య ప్రక్రియను సమర్థవంతంగా నిలిపివేస్తాయి' అని రే కుర్జ్‌వీల్ బలంగా చెబుతున్నారు.
Also Read : ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే..7 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
Also Read : జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
కుర్జ్‌వీల్ 86 శాతం సక్సెస్..
సాంకేతిక రంగంలో ఇలాంటి నాటకీయ అంచనాలు వేయడం రే కుర్జ్‌వీల్ కు కొత్తేమీ కాదు. డిజిటల్ ఆవిష్కరణ దిశను అంచనా వేయడంలో ఆయన దూరదృష్టిగా ప్రసిద్ధి చెందారు. అందరూ అసాధ్యమని భావించినా.. ఆయన అంచనాలు మాత్రం చాలా సంవత్సరాల క్రితం ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో నిజమయ్యాయి. ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు, జీవశాస్త్రం, కంప్యూటింగ్ ప్రజాదరణ పొందుతాయని ఆయన దశాబ్దాలకు ముందే అంచనా వేశారు. అతని 147 అంచనాలలో దాదాపు 86 శాతం నిజమయ్యాయి. - కుర్జ్‌వీల్ ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నాడు. విమర్శలపాలయ్యాడు. 1999లో అతనికి నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ లభించింది. ఇది US ప్రభుత్వం దాని ఆవిష్కర్తలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.
యంత్రాలకు మానవ స్థాయి మేధస్సు..
ఇక 2029 నాటికి మానవ మేధస్సును అంచనవేయడంలో AI మానవ మెదడులో విలీనం అవుతుందంటున్నారు. ఈ జీవ పరివర్తన కృత్రిమ మేధస్సు అపూర్వమైన అభివృద్ధితో కూడి ఉంటుందని, మరో నాలుగేళ్లలో AI దాని కీలకమైన బెంచ్‌మార్క్‌ను చేరుకుంటుందని కుర్జ్‌వీల్ విశ్వసిస్తున్నారు. యంత్రాలు మానవ స్థాయి మేధస్సును కలిగి ఉంటాయి. ట్యూరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలవు. ఇది మానవుడి నుంచి వేరు చేయలేని ప్రవర్తనను అనుకరించే స్థాయికి చేరుకుంటుంది. మానవులు, యంత్రాలు సహజీవనం చేయడమే కాకుండా కలిసి జీవిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. AIతో మానవ జ్ఞాపకశక్తి, అవగాహన, నిర్ణయాలు తీసుకోవడం మరింత మెరుగుపడుతుంది. మానవ సామర్థ్యాలను, సహజ జీవ పరిమితులకు మించి ఈ టెక్నాలజీ తీసుకువెళుతుందని వెల్లడించారు.
Also Read : స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ.. నటి దీపికా ఎమోషనల్ పోస్ట్!
2045 నాటికి మానవ మేధస్సుకు మించి..
భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి మానవ నాగరికతను మార్చే స్థాయికి చేరుకుంటుంది. 2045నాటికి మానవ మేధస్సు బిలియన్ రెట్లు పెరుగుతుంది. మనం మన స్వంత ఆవిష్కరణలతో మమేకం అవుతునే కొత్త రకమైన ఉనికిని కనుగోనేందుకు దారులు వేయాలి. అలాంటి ప్రపంచాన్నే ఊహించాలని కుర్జ్‌వీల్ చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఆవిష్కర్తలు కూడా కుర్జ్ వీల్ ఆలోచనలకు మద్దతు ఇచ్చారు. సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్.. 2047నాటికి సూపర్-ఇంటెలిజెంట్ యంత్రాల ఆవిర్భావాన్ని అంచనా వేశారు. యంత్రాలు వాటంతట అవే నేర్చుకుంటాయంటున్నారు సన్. యంత్రాలు భావోద్వేగ మేధస్సును పొందుతాయి. టెక్నాలజీ మేధస్సులో మానవాళి స్థానాన్ని ఆక్రమించగలదు అని అన్నారు.
అమరత్వం ధనవంతులకు మాత్రమేనా..
కుర్జ్‌వీల్ చెబుతున్న అమరత్వం సైన్స్ శక్తిపై ఆధారపడి ఉన్నప్పటికీ ఇది చాలా ప్రాథమిక నైతిక, తాత్విక సమస్యలను లేవనెత్తుతోంది. మానవులకు ఇకపై వృద్ధాప్యం ఉండకపోతే, సహజంగా చనిపోకపోతే జనాభా పెరుగుతుంది. దీంతో మానవులకు కావాల్సిన వనరులు, ఆర్థిక సమతుల్యతను ఎలా నిర్వహిస్తాం? అమరత్వం ధనవంతులకు మాత్రమేనా లేక అందరికీ హక్కు అవుతుందా? మరణం ఇకపై అనివార్యమైన వాస్తవికత కానప్పుడు వారసత్వం గురించి మన భావనలు ఎలా ఉంటాయి? ఇవి కేవలం శాస్త్రీయ ప్రశ్నలు కాదు. సాంస్కృతిక, నైతిక, లోతైన మానవ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పలువురు నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
AI విప్లవంపై ఆందోళనలు..
మరోవైపు AI విప్లవం ప్రారంభ దశలనే ఆందోళన కలిగించేలా ఉందని ప్రపంచవ్యాప్తంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 2023లో గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇతర ప్రధాన టెక్ కంపెనీలు ప్రజలను ఆకర్షించు, భయపెట్టే విధంగా అధునాతన AI-ఆధారిత చాట్‌బాట్‌లను ప్రారంభించాయి. ఈ కొత్త ఆవిష్కరణలపట్ల ఉత్సాహం చూపుతున్నప్పటికీ మానవుల నియంత్రణకు మించి స్వయంప్రతిపత్తితో ప్రవర్తించే AI వ్యవస్థలపై ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. మార్చి 2023లో ఎలోన్ మస్క్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక వ్యవస్థాపకుల బృందం AI పరిశోధనను నిలిపివేయాలని కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేయడం సంచలనం రేపింది. ప్రస్తుత AI వ్యవస్థలు సమాజానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Also Read : భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!
robo | humans | telugu-news | today telugu news