USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అంతేకాదు జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
రష్యా, చైనా వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ మావద్ద వాటికంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 150 సార్లు పేల్చేయగలం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటే పాటను పదే దే పాడుతూనే ఉన్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య వార్ ను తానే ఆపానని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. తాజాగా తన వాదనను మళ్ళోకసారి చెప్పారు. అయితే ఈసారి విమానాల సంఖ్య ఎనిమిదికి పెంచారు.
న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం vs కామన్ సెన్స్ గా ఆయన గెలుపు ను అభివర్ణించారు. మామ్దానీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అమెరికా, చైనాలు కలిసి పోయాయి. ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. జపాన్ పర్యటనలో భాగంగా నిర్వహించిన గౌరవవందనం సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.