హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అరాచకం వెలుగులోకి వచ్చింది. బేబీలాన్ పబ్‌లో సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. పబ్‌లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా వివరించింది.
తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టడం స్టార్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని బాధితురాలు తెలిపింది. బేబీలాన్ పబ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ FIR చేయలేదని మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేశారు.
Jubliee hills police station | influencer | insta-influencer | hyderabad | pub | latest-telugu-news