/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Farmer-Loans-jpg.webp)
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఖరీఫ్ మద్దతు ధర పెంపు తీర్మాణాన్ని కేంద్ర కేబినెట్ ఆమెదించింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు అనుగుణంగా ఖరీఫ్ పంట కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌కు వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.69 పెంచి రూ.2,369కి కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
Also Read : క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?
Union Cabinet Supports Kharif
Cabinet approves Minimum Support Prices (MSP) for 14 Kharif Crops for Marketing Season 2025-26
— Dhirendra Ojha (@DG_PIB) May 28, 2025
The increase in MSP for Kharif Crops at a level of at least 1.5 times of the All-India weighted average cost of production
#CabinetDecisions pic.twitter.com/JXbkPXgRKB
Also Read : జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
వరికి కనీస మద్ధతు ధరను క్వింటాలుకు రూ.69 పెంచారు. దీంతో క్వింటాలుకు రూ.2,369 ధర వరికి రానుంది. కందిపప్పుపై రూ.450 కనీస మద్దతు ధర పెంచి క్వింటాకు రూ. 8 వేలు చేశారు. పెసర రూ.86, మినుములకు రూ.400లు క్వింటాల చొప్పున పెంచారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటల కనీస మద్దతు ధరను వరుసగా క్వింటాలుకు రూ.480, రూ.441, రూ.436 పెంచింది కేంద్రం.
Also Read : పెళ్లి వేదికపైకి ఖడ్గమృగం సడెన్ ఎంట్రీ.. బిత్తరపోయిన అతిథులు! వీడియో వైరల్
Alsoo Read : స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ.. నటి దీపికా ఎమోషనల్ పోస్ట్!
msp | union-cabinet | minimum support price | ashwini-vaishnaw | latest-telugu-news | farmer