Crime News: విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్‌ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!

విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాక్టికల్స్ వైవా సమయంలో 12మంది స్టూడెంట్స్‌ను తాకాడు. మరో విద్యార్థిని చేతిపై ఫోన్ నంబర్ రాసి కాల్ చేయమన్నాడు. ఇదంతా పోలీసులకు తెలియడంతో అరెస్టు చేశారు.

New Update
Uttarakhand Roorkee assistant professor held for molesting 12 students during exam

Uttarakhand Roorkee assistant professor held for molesting 12 students during exam

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మంచి చెడు చెప్పాల్సిన వారే విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. భయపెట్టి, బెదిరించి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

చేతిపై ఫోన్ నెంబర్ రాసి

ఉత్తరాఖండ్ రూర్కీలోని ప్రభుత్వ డిగ్రి కాలేజీలో 55 ఏళ్ల అబ్దుల్ అలీమ్ అన్సారీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్తున్నాడు. అతడు దాదాపు 12 మంది విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బీఎస్సీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వైవా సమయంలో విద్యార్థినులను తాకరానిచోట తాకాడు. అందులో ఒక విద్యార్థిని చేతిపై తన మొబైల్ నెంబర్ రాశాడు. ఇంటికి వెళ్లాక తనకు కాల్ చేయాలని చెప్పాడు. 

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

అనంతరం క్లాస్ రూమ్‌ నుంచి బయటకొచ్చిన ఆ విద్యార్థిని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తోటి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంది. ఇక వారు కూడా తమ బాధను ఆమెతో పంచుకున్నారు. తమతో కూడా ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగానే ప్రవర్తించినట్లు తెలిపారు. దీంతో ఈ దారుణమైన ఘోరం బట్టబయలైంది. తాను చెప్పిన మాట వినకపోతే పరీక్షల్లో మార్కులు తగ్గిస్తానని ఆ ప్రొఫెసర్ బెదిరించినట్లు విద్యార్థినులు వాపోయారు. 

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

అనంతరం అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు చేప్పట్టారు. ఈ వ్యవహారం కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పలువురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. స్టూడెంట్స్‌ను తాకినట్లు అంగీకరించాడు. అనంతరం బుధ, గురువారాల్లో నిర్వహించిన రెండు ప్రాక్టికల్ ఎగ్జామ్‌లను క్యాన్సిల్ చేశారు. 

Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

latest-telugu-news | telugu-news | crime news | Latest crime news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు