/rtv/media/media_files/2025/05/16/uuCFXMKmNsbwIsoqzOLI.jpg)
సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం జరిగింది. భారత్ తో జరిగిన యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడిన పాకిస్తాన్ .. మరో అబద్ధం ఆడి సొంత దేశంలోనే పరువు తీసుకుంది. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించిందని ఫేక్ ప్రచారం చేసుకుంది. స్వయంగా పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ యూకేకి చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ క్లిప్ ను చూపిస్తూ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించిందంటూ అబద్ధాలను ప్రచారం చేశారు. అయితే ఈ ప్రకటనను పాకిస్తాన్ పత్రికలు కొట్టిపారేసాయి. పాకిస్తాన్ వార్తాపత్రిక ది డాన్ ఈ క్లిప్ ను ఐవెరిఫై చేసి ఇది ఫేక్ అని తేల్చింది. ది డైలీ టెలిగ్రాఫ్ లో అసలు ఇలాంటి కథనమే రాలేదని తేల్చింది. ఇషాక్ దార్ చూపించిన టెలిగ్రాఫ్ పేపర్ క్లిప్ ఫేక్ అని తేల్చిన పాకిస్తాన్‌లోని అనేక మంది జర్నలిస్టులు, మీడియా విశ్లేషకులు తమ పత్రికల్లో ఆయన చెప్పింది ఫేక్ అని ప్రచురించారు. దీంతో స్వంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ ప్రభుత్వ యంత్రాంగం ఓ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీని నడిపించదనే చెప్పాలి. కానీ వాటిని PIB ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ కౌంటర్ ఇస్తూ వచ్చింది.
Also Read : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!
An image circulating on social media claims to show the front page of UK-based newspaper The Daily Telegraph, featuring a headline that reads: "Pakistan Air Force: The undisputed king of the skies” dated 10th May 2025#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 16, 2025
✔️This claim is #false
✔️The image being… pic.twitter.com/8hxskb5aM4
Also Read : ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్‌ను ప్రేమించి..చెల్లెలు కావాలని...
Also Read : యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. లైవ్ లోనే ఘోరం ( వీడియో వైరల్)
ఉగ్రవాదులకు మరోసాయం
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకోబోతుంది. ప్రభుత్వ నిధులతో జైషే మహ్మద్ ఉగ్రస్థావరం పునర్మిర్మాణం చేపడతామని పాకిస్థాన్ మంత్రి రాణా తన్వీర్ హుస్సేన్ స్వయంగా వెల్లడించారు. "భారత్ ఆపరేషన్‌లో భాగంగా ధ్వంసమైన మసీదు మర్కజ్ తైబా పునర్నిర్మాణం జరుగుతుంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, పాకిస్థాన్ సైనిక అధిపతి అసిమ్ మునీర్ పునర్నిర్మాణ ఖర్చును భరిస్తారు" అని వెల్లడించారు. ప్రభుత్వ సాయంతో పాటు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం పాక్ పీఎం, ఆర్మీ చీఫ్ సాయం చేస్తారని తెలిపారు. పాకిస్తాన్ తీరుపై భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.
Also Read : వల్లభనేని వంశీపై మరో కేసు
india | Pakistan Air Force Crash | Fake Propaganda | Pakistan government