Toll: మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ

శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 

New Update
Toll Plaza

Toll Plaza

టోల్ గేట్ల దగ్గర శాటిలైట్ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్రం చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. కానీ నిన్న కొన్ని మీడియా సంస్థల్లో శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచి అమలు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శాటిలైట్ టోల్ విధానంపై తాము ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని స్పష్టం చేసింది.  మే 1 నుంచి ఇది అమలు అవుతుందనేది అబద్ధం అని చెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ ద్వారానే టోల్ విధానం కంటిన్యూ అవుతుందని కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 

Also Read :  110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాల నిలుపుదల

Also Read :  అత్యాచారం చేశాడని..నగ్నంగా మార్చి, ఎడ్లబండికి కట్టి..

శాటిలైట్ టోల్..కొత్త ప్రాజెక్ట్

దూర ప్రయాణాలు చేసేటప్పుడు హైవేపై టోల్‌ గేట్‌ ఉండే రూట్‌లో వెళ్తే రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇకనుంచి హైవేపై టోల్‌ బూత్‌ వరకు వెళ్లకున్నా కాస్త దూరమే ప్రయాణం చేసినా ఆ వాహనంపై టోల్‌ రుసుము కట్‌ కానుంది. ఇలాంటి కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాదికి ప్రాథమిక స్థాయిలో ఇది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దశల వారిగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌తో అనుసంధానమయ్యే ఈ కొత్త టోల్‌ వ్యవస్థ అసలు టోల్ బూత్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. వాహనాలు టోల్‌ రోడ్ మీద తిరిగిన దూరాన్ని శాటిలైట్ సాయంతో గుర్తించి టోల్‌ను లెక్కిస్తుంది. ఈ వ్యవస్థతో లింక్‌ అయి ఉన్న ఖాతా నుంచి టోల్‌ ఫీజు కట్ అవుతుంది. అంతేకాదు అసలు టోల్‌బూత్‌లే ఉండవు. దీంతో వాహనాలు ఎక్కడా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు. దీని వలన ప్రభుత్వానికి కూడా మరింత ఆదాయం రానుంది. ఎవరూ టోల్ ఎగ్గొట్టలేరు కాబట్టి ప్రభుత్వానికి ఆటోమాటిక్ గా డబ్బులు వచ్చేస్తాయి. 

Also Read: RCB VS PBKS: సొంత గ్రౌండ్ లో రెండోసారి ఓటమి..5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచిన పంజాబ్

Also Read :  ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం..పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేసిన ఆప్ అధినేత

 

central | satellite | toll | today-latest-news-in-telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు