/rtv/media/media_files/2025/04/19/Bvq7hcA7KaTHnUMXdjw2.jpg)
UP Rape Accused beaten
ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా విశేశ్వర్ గంజ్ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు వచ్చే లోపు ఆ కుర్రాడు పారిపోయాడు. రెండు రోజుల పాటు అటు పోలీసులు, ఇటు గ్రామస్థులు అతడి కోసం విపరీతంగా వెతికారు. అయినా లాభం లేకపోయింది. కానీ తరువాత ఒకరోజు గ్రామస్తులు అతనిని పట్టేసుకున్నారు. అయితే వారు ఆ యువకుడిని వెంటనే పోలీసులకు అప్పగించలేదు. తిరిగి గ్రామానికి తీసుకుని వెళ్లారు.
Also Read : ట్విస్ట్ అదిరింది.. నితిన్-వేణు సినిమాలో పెళ్లైన స్టార్ హీరోయిన్!
పిచ్చ కొట్టుడు కొట్టారు..
అలా తీసుకెళ్ళిన వారు ఆ యువకుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ముందు అతడిని నగ్నంగా మార్చారు. తరువాత ఎడ్ల బండికి కట్టేశారు. దాంతో ఊరంతా తిప్పారు. ఆ తరువాత యువకుడిని చితక్కొట్టారు. అలా ఊరంతా కొడుతూనే ఎడ్ల బండితో తిప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఎంత వద్దని వారిస్తున్నా గ్రామస్తులు వినలేదు. ఈక్రమంలోనే పలువరు అతడిపైకి కుక్కలను కూడా ఉసిగొల్పేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు గ్రామస్థుల కాళ్లావేళ్లా పడుతూ అతడిని వదిలేయమని ప్రాధేయపడ్డారు. కానీ ఏమాత్రం కనికరం చూపకుండా వారు దాడి చేస్తూనే ఉన్నారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు
గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు దాదాపు 15 రోజుల పాటు యువకుడు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాడు. ఈ టైమ్ లో పలువురు గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో కుటుంబ సభ్యుల వరకూ చేరింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచార నిందితుడిని కొట్టి నగ్నంగా ఊరేగించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ గొడవ మరింత ముదిరింది.
Also Read: Delhi: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం..పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేసిన ఆప్ అధినేత
Also Read : తండ్రి లేడని వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి.. బోరున ఏడ్చేసిన హరీష్ రావు! వీడియో వైరల్
rape | accused | today-latest-news-in-telugu | Uttar Pradesh | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news