NIA: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు లష్కరే తొయిబా కుట్ర!

ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్‌ హెడ్లీ హైదరాబాద్‌లో నివాసం ఉండాలనుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.అంతేకాకుండా సైబరాబాద్‌ లోనూ ఉగ్రదాడికి ..లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు గుర్తించాయి.

New Update
26/11

Mumbai Attack Mastermind Headley

కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్‌ హెడ్లీ అలయాస్‌ దావూద్‌ గిలానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న ప్లేసుల్లో హైదరాబాద్‌కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. అంతేకాకుండా అప్పట్లో సైబరాబాద్‌ లోనూ ఉగ్రదాడికి ..లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు గుర్తించాయి.

Also Raed: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ సంచలన నిర్ణయం!

2008 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికా నుంచి రప్పించి విచారిస్తున్న సంగతి తెలిసిందే.అంతకు ముందు ఇదే కేసు దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అదుపులో ఉన్న హెడ్లీని 2010లో ఎన్‌ఐఏ ఉన్నతాధికారులు విచారించారు.తాను భారత్‌ పై యుద్ధం ప్రకటించిన ఎల్‌ ఈటీ తరుఫున పని చేశానని హెడ్లీ విచారణలో అంగీకరించడంతో పాటు మరెన్నో కీలక అంశాలు వెల్లడించారు.

Also Read: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

NIA Report

ఆ వివరాలతో ఎన్‌ఐఏ 106 పేజీల నివేదిక రూపొందించింది. దాని ఆధారంగానే ఇప్పుడు తహవ్వుర్‌ ను ప్రశ్నిస్తున్నారు.ఆ నివేదికలోని అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.మేం నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా నేను అనేక మార్లు భారత్‌ ను సందర్శించా..లష్కరే తోయిబా..దౌరా ఏ ఆమ్‌ పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరయ్యా.

ఆయుధాల వాడకానికి సంబంధించి దౌరా ఏ ఖాస్‌పేరుతో మూడు నెలల పాటు నిర్వహిచిన ప్రత్యేక శిక్షణనూ పూర్తి చేశా. నన్ను పర్యవేక్షిస్తున్నారు.సహచరులతో నిరంతరం రహస్యంగా ఎలా సంప్రదింపులు జరపాలో నిర్దేశించేందుకు దౌరా ఎ రిబాత్‌పేరిట నిర్వహించిన మూడు వారాల శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత నన్ను ముజఫరాబాద్‌ లో ఐస్‌బాక్స్‌ అని పిలుచుకునే సేఫ్‌ హౌస్‌ కి తీసుకెళ్లారు.

భవిష్యత్తులో తాము భారతదేశంలో జరపబోయే దాడులకు సంబంధించిన వివరాలను ఎల్‌ఈటీకి చెందిన సాజిద్‌ మజీద్‌,అబు క్వహాఫా, ముజిమ్మిల్‌ వివరించారు.వాటికి సంబంధించిన కొన్ని మ్యాపులు, ఫొటోలు కూడా చూపారు.అందులో రాజ్‌కోట్‌ లోని చమురుశుద్ధి కర్మాగారం,సైబరాబాద్‌ మ్యాప్‌ ఉంది. ఆ రెండు చోట్లా దాడులకు ఎల్‌ఈటీ వ్యూహం పన్నినట్లు సమాచారం.

ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఎల్ఈటీ నన్ను భారత్‌ కు పంపాలని అనుకుంది. ఈ సందర్భంగా నేను నివసించడానికి అనుకూలమైన నగరాలపై చర్చ జరిగింది.ఆ జాబితాలో కోల్ కతా, ఢిల్లీ, బెంగళూరు, పుణే,నాగపూర్‌ లతో పాటు హైదరాబాద్‌ కూడా ఉందని హెడ్లీ వెల్లడించినట్లు ఎన్‌ఐఏ నివేదికలో ఉంది.

Also Read: America-Gunturu:టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

Also Read: Russia: మస్క్ లాంటి వారు చాలా అరుదు..రష్యా అధ్యక్షుడు పుతిన్

 

telugu-news | hyderabad | mumbai | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు