/rtv/media/media_files/2025/04/17/EWdy0huhzOTw9vTRFjNA.jpg)
Putin, Elon musk
మీకు తెలుసా...అమెరికాలో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను అంగారక గ్రహం గురించి కలల కంటుంటాడు. వాటిని చాలా గొప్పగా చెబుతాడు కూడా. మానవజాతిలో ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మస్క్ కలలు త్వరలోనే నిజాలు అవుతాయి. మనకు నమ్మశక్యం కానీ విషయాలు మస్క్ చేసి చూపిస్తాడు. ిలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటాయి అంటూ తెగ పొగిడేశారు. ఇవన్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాన్ మస్క్ గురించి మాస్కోలోని బౌమన్ యూనివర్శిటీలో విద్యార్థులకు చెప్పిన మాటలు. అంతేకాదు పుతిన్ మస్క్ ను సోవియట్ కాలం నాటి రాకెట్ శాస్త్రవేత్త సెర్గీకొరొలోవ్‌తో కూడా పోల్చారు. ఇదొక్క చోటే కాదు అంతకు ముందు జర్నలిస్ట్ టకర్ కార్ల్‌సన్‌తో మాట్లాడుతూ కూడా పుతిన్ మాట్లాడుతూ ఎలాన్ మస్క్ కు ఎదురు లేదు అంటూ చెప్పారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మస్క్ ను పొగడ్డం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు 2023 ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో పుతిన్ మాట్లాడుతూ ఎలాన్ ఓ అసాధారణ వ్యక్తి.. ప్రతిభావంతుడైన వ్యాపారవేత్త. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది అని అన్నారు.
ముందు పొగడ్తలు..వెనుక కుట్ర..
అయితే రష్యా అధ్యక్షుడు ఎలాన్ మస్క్ ను ఎంత పొగిడినా పెద్ద ప్రయోజనం లేదని అంటోంది సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్ సంస్థ. అతని స్పేస్ షిప్ అయిన స్టార్ లింక్ కు రష్యా నుంచి ముప్పు ఉందని చెబుతోంది. దాన్ని కూల్చే అవకాశం ఉందని తెలిపింది. ఉపగ్రహాలను కూల్చే సామర్థ్యం మొత్తం 12 దేశాలకు ఉన్నట్లు తన 316 పేజీల రిపోర్ట్ లో రాసింది. ఉక్రెయిన్ యుద్ధంలో 2022 నుంచి స్టార్ లింక్ వినియోగం మొదలుపెట్టినా.. 2024లో మాత్రం కొన్ని సమస్యలు ఎదురయ్యాయని.. రష్యా పరీక్షిస్తున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల కారణంగానే ఇది జరిగిందని వివరించింది.
today-latest-news-in-telugu | russia | vladimir-putin | elon-musk
Also Read: Cinema: గద్దర్ అవార్డ్స్.. 15 మందితో జ్యూరీ నియామకం..