Terrorists Arrest: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8మంది ఉగ్రవాదుల అరెస్ట్‌..!

దేశంలో ఉగ్రవాదుల కదలికలు మరోసారి కలకలం రేపాయి. దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు ఒక ఐసిస్ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Terrorists arrest

Terrorists arrest

దేశంలో ఉగ్రవాదుల(Terrorists) కదలికలు మరోసారి కలకలం రేపాయి. దేశరాజధాని ఢిల్లీ(Delhi) లో పోలీసులు ఒక ఐసిస్ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అఫ్తాబ్ ను ముంబై లో అదుపులోకి తీసుకోగా, అషర్ డానిష్ అనే మరో అనుమానితుడిని కూడా పోలీసులు రాంచీలో అరెస్టు చేశారు. అలాగే తెలంగాణ నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లోనూ ఒక అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన అపరేషన్‌లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

8 Terrorists Arrested Across The Country

ఈ సందర్భంగా వారిచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 12 కి పైగా ప్రదేశాలపై స్పెషల్ సెల్ , కేంద్ర ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి.ఈ దాడుల్లో వివిధ ప్రాంతాల్లో మొత్తం 8 మంది అనుమానిత ఉగ్రవాదులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక లాడ్జిలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులతో కలిసి ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు చేస్తూ రాంచీలో దాడి చేశారు.  రాంచీలోని లోయర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇస్లాం నగర్‌కు చెందిన ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అతని వద్దనుంచి అనేక అనుమానిత వస్తువులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం.

Also Read: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

రాంచీలో అరెస్టు చేయబడిన అనుమానిత ఉగ్రవాది పేరు అషర్ డానిష్, అతను బొకారో జిల్లాలోని పెట్వార్ నివాసి అని చెబుతున్నారు. ఢిల్లీలో నమోదైన కేసు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు బృందం విచారిస్తోంది. దీనితో పాటు ఉగ్రవాద సంస్థలతో అతనికి ఉన్న సంబంధాలను కూడా అన్వేషిస్తోంది.

ఇది కూడా చదవండి:KTR కు ఏసీబీ బిగ్ షాక్‌..ఫార్ములా ఈ కార్‌ రేసులో అరెస్ట్‌ ?

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఏ, దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్‌ డ్యానిష్‌ ను అరెస్ట్ చేశాయి. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. దిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్‌ఐఏ అధికారులు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన ఒక వ్యక్తిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి.  

Also Read: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!

Advertisment
తాజా కథనాలు