Nepal: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

మూడు రోజులు నేపాల్ అట్టుడుకిపోయింది. సోషల్ మీడియా బ్యాన్ తో రెచ్చిపోయిన యువత మొత్తం దేశాన్ని అల్లకల్లోం చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మంత్రులు, వారి కుటుంబాలు పారిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
nepall

నేపాల్‌(Nepal) లో సోషల్‌ మీడియాపై నిషేధం(Social Media Ban), అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్‌ జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ తో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అలాగే పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. ఈ గొడవల్లో ఇప్పటికి 30 మంది దాకా చనిపోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు.

Also Read :  నేపాల్ నూతన ప్రభుత్వాధినేతగా సుశీలా కర్కి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!

బతికుంటే చాలు..

ఈ క్రమంలో నేపాల్ మంత్రులు ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని దేశం విడిచి పారిపోయారు. నేపాల్ మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగులబెట్టడంతో..తమకు ఎక్కడ ఆ పరిస్థితి దాపురిస్తుందో అనే భయంతో విలవిల లాడారు. ఎలా అయినా ఈ గొవల నుంచి తప్పించుకోవాలనుకున్నారు. దాని కోసం సాహసాలకు పూనుకున్నారు. నేపాల్ యువత పాలకులను తరిమి కొట్టగా వారి నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోడానికి మంత్రులు, వారి కుటుంబ సభ్యులు సైన్యం హెలికాప్టర్ తాడుకు వేలాడుతూ కనిపించారు. అక్కడి నుంచి బయటపడతే అదే చాలు అనుకున్నారు. పూర్తిగా హెలికాఫ్టర్ కూడా ఎక్కే పరిస్థితి...అసలు దాన్ని ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో..గాల్లో వేలాడుతూ తప్పించుకున్నారు. ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి(kp-sharma-oli) రాజీనామా చేసి దుబాయ్‌కు పారిపోయారు. కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. కమ్యూనికేషన్, ఐటీ మంత్రి పృథ్వి సుబ్బ గురుంగ్ నివాసం దహనం చేశారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణుపౌడెల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. నేపాల్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గవర్నర్బిస్వోపౌడెల్, మాజీ హోం మంత్రి రమేష్లేఖక్ నివాసాలు కూడా దాడికి గురయ్యాయి.

ఆర్థిక మంత్రిపై బహిరంగంగానే దాడి..

నేపాల్ ఆర్థిక మంత్రి పరిస్థితి అయితే మరీ దారుణం. ఆయనను నడి రోడ్డు మీదనేనిరసకారులు వెంబడించారు. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఎగిరెగిరి మరీ తన్నాడు. తరువాత నదిలోకి తోసేశారు. విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్‌బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యం కొంత మంది మంత్రులనూ, వారి ఫ్యామిలీలను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

Also Read: BIG BREAKING: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!

Advertisment
తాజా కథనాలు