/rtv/media/media_files/2025/09/10/80-year-old-man-raped-an-11-year-old-girl-2025-09-10-17-04-53.jpg)
80-year-old man raped an 11-year-old girl
CRIME: వయసుతో సంబంధం లేకుండా ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాళ్లు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. వయసుతో పని లేకుండా పసిదాని నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్ట కుండా అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు... కామంతో రెచ్చిపోతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అభం శుభం ఎరుగని ఓ 11 ఏళ్ల చిన్నారిపై.. 80 ఏళ్ల వృద్దుని రూపంలో ఉన్న మృగం లైంగిక దాడికి పాల్పడింది.
उत्तर प्रदेश सहारनपुर में एक बुजुर्ग आटा चक्की मालिक ने 11 साल की बच्ची से छेड़छाड़ की कोशिश की, जो वीडियो में साफ दिख रही है। बच्ची आटा पिसवाने आई थी, लेकिन आरोपी ने उसे कमरे में खींचने की कोशिश की !!
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 9, 2025
pic.twitter.com/VFqgQYN6S9
Also Read: అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ అత్యంత దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ లో చోటు చేసుకుంది. స్థానికంగా పిండి మిల్లు నిర్వహిస్తున్న వృద్దుడు ఆ పిండి మిల్లులోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ లో ఆ 80 ఏళ్ల వృద్ధుడికి పిండి మిల్లు ఉంది. ఇందులో 11 ఏళ్ల బాధిత బాలికను పనిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. అయితే... కామంతో రెచ్చిపోయిన ఆ వృద్ధుడు... బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పిండిమిల్లులో పనిచేస్తున్న బాలికను బలవంతంగా లోనికి లాక్కెల్లిన వృద్దుడు గదిలోకి తీసుకెళ్లి బలవంతం చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాలిక ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే ఈ ఘటన రోడ్డు పక్కనే ఉన్న పిండిగిర్నిలో జరిగినప్పటికీ అటునుంచి వెళ్తున్న వారు ఎవరు పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ ఘటనంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ వృద్దుడు అంతకు ముందు కూడా చాలా సార్లు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..