/rtv/media/media_files/2025/07/06/wife-attacked-husband-2025-07-06-08-41-47.jpg)
wife attacked husband
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. అయితే భర్తను చంపిన భార్య మాత్రం కన్నీరుమున్నీరుగా విలపించడం చూసి అంతా అవక్యాయ్యారు. కారణం అమె అతన్ని కావాలని చంపలేదని వాపోతుంది. రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో ఆమెను విపరీతంగా కొట్టేవాడని, అలాంటిది కోపంతో భార్య తిరిగి ఒకటి కొట్టడంతో భర్త కుప్పకూలిపోయి మరణించడం సంచలనం సృష్టించింది.
Also read: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!!
Wife Attacked Husband
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంలోని బనశంకరి మార్గంలోని సుద్దుగుంటెపాళ్య పోలీసుఠాణా పరిధిలో సుద్దగుంటెపాళ్య నివాసి భాస్కర్ జూన్ 27న రాత్రి అనుమానాస్పద రీతిలో మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోస్ట్ మార్టం లోఒ ఆయనను బలంగా కొట్టడం వల్లే మరణించాడని నిర్ధారించారు. విచారణ అనంతరం ఆయన భార్య శృతి తానే భర్తను చంపినట్లు నిర్ధారించారు. అయితే తన భర్తను కావాలని చంపాలేదని, భర్త పెట్టే వేధింపులను సహించలేక రాగిస సంగటి తయారు చేయడానికి ఉపయోగించే కర్రతో ఆయన తలపై ఒకటి వేశానని వివరించింది. ఆ ఒక్కదెబ్బకే ఆయన చనిపోతారనుకోలేదని విలపించింది.
Also Read: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!
భాస్కర్, శృతి భార్యభర్తలు..వీరికి పన్నెండ్ల క్రితం పెళ్లి అయింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్ ఆర్థికంగా బాగనే ఉండటంతో ఆ ప్రాంతంలో ఆరు ఇండ్లు కట్టాడు. వాటి మీద వచ్చే ఆదాయంతో జీవించడం తప్ప ఏ పనిచేసేవాడు కాదు. కష్టపడకుండానే డబ్బు వస్తుండంతో మద్యానికి అలవాటు పడిన ఆయన నిత్యం తాగుతూ ఎంజాయ్ చేసేవాడు. అంతే కాక, ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఆయన చేష్టలు భరించలేక శృతి ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ భాస్కర్‌లో మార్పు రాలేదు. రోజూ మద్యం తాగుతూ ఇంటికి వచ్చి భార్య పిల్లలను కొట్టే వాడు. ఒక దశలో భాస్కర్ ఇంటికి వస్తున్నాడంటే వారంతా వణికిపోయే పరిస్థితి నెలకొంది.
Also read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
జూన్ 27న కూడా రాత్రి భాస్కర్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. చాలాసేపు ఓపిక పట్టిన శృతి కోపం తట్టుకోలేక వంటగదిలోకి వెళ్లి రాగిముద్ద చేసే కర్ర పట్టుకొచ్చింది. దానితో భాస్కర్‌తలపై బలంగా ఒక్కటిచ్చింది. దీంతో ఆ దెబ్బకు ఆయన కిందపడి.. మళ్లీ లేవనేలేదు. తల నుంచి కారిన రక్తాన్ని తుడిచి, స్నానం చేయించి, పడక గదిలో పడుకోబెట్టినట్లు’ ఆమె పోలీసులకు వివరించింది. 28న ఉదయం లేచిన వెంటనే తన వల్ల జరిగిన తప్పును గుర్తించిన శృతి దానినుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసింది. ‘నా భర్త బెడ్రూంలో కదలకుండా పడిపోయారు. ఆయనకు ఏదో జరిగింది’ అంటూ వీధిలోకి వెళ్లి కేకలు వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు దృవీకరించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హత్యకు ఉపయోగించిన రాగిముద్ద కర్రను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, "రోజు తాగివచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. మా ఇంటి పక్కనే ఉన్న భవనంలో ఎవరో ఒకరు ఆడవారితో గడిపేవాడు. పని చేసేవాడు కాదు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయా. ఆయన కొడుతుంటే తట్టుకోలేక నేనూ తిరిగి కొట్టాలని ఆపనిచేశా. కానీ, ఒక్కదెబ్బకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆయనను చంపాలన్న ఉద్దేశం నాకు లేదు' అని శృతి కన్నీరు పెట్టుకుంది.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
karnataka Wife Ki**lls Husband | wife-killed | wife-killed-husband | wife-killed-her-husband | Wife Kills Husband | crime news today | Bengaluru Incident | bengaluru | karnataka