Naga Chaitanya NC24: ఇటీవలే 'తండేల్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య.. తన తదుపరి ప్రాజెక్ట్ 'విరూపాక్ష' ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో చేస్తున్నారు. NC24 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read: Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!
భారీ గుహ సెట్
ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే భారీ ఎత్తున జరగనుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ అద్భుతమైన గుహ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారట. ఈ సెట్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, హీరోయిన్, ఇతర సహనటుల మధ్య కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కథను అందించగా.. కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో చై మేకోవర్ మునుపెన్నడూ చూడని విధంగా భిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఆధునిక కథనానికి పురాణం ఇతిహాసాలను కలిపి ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
#NC24
— chaitanya akkineni (@chay_akkineni) July 4, 2025
@karthikdandu86@BvsnP@aryasukku@AJANEESHB#RagulDharuman@NavinNooli@Srinagendra_Art@SVCCofficial@SukumarWritings@Nc24chroniclespic.twitter.com/lORbCOZjza
ఇందులో చై నిధి అన్వేషకుడి పాత్రలో కనిపించగా.. హీరోయిన్ మీనాక్షి చౌదరీ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటైన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిమాలో ఇతర నటీనటుల వివరాలు, సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే