Wife Kills Husband : కరెంట్ షాక్తో భర్తను చంపి..ఇంట్లోనే పాతిపెట్టి...
అక్రమ సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యల క్రైం స్టోరీలే ఎక్కువగా వింటున్నాము. తాజాగా ముంబైలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది. భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది భార్య.