Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
భర్తల హత్యల పరంపరలో మరో హత్య చోటు చేసుకుంది. హైదరాబాద్ కోకాపేట్లో దారుణం వెలుగు చూసింది . కట్టుకున్న భర్తపై కత్తితో దాడి చేసి హతమార్చిందో భార్య. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
భార్యభర్తల మధ్య వచ్చిన గొడవల నేపథ్యంలో ఆవేశానికి గురైన భార్య భర్తపై మరుగుతున్న నూనె పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వన్యప్రాణుల దాడిలో మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం దక్కుతుందన్న ఆశతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ఆ తరువాత పులి దాడి కథను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ, దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఆమె ఫన్నాగం విఫలమైంది.
మధ్యప్రదేశ్లో వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. అతని మూడో భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయట పడింది. రాజస్థాన్ అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. మృతుని భార్యాపిల్లలు కూడా మిస్సయ్యారు.