Crime News: భార్యను హత్య చేసి పరారయ్యాడు.. నిందితుడిపై రూ.2 కోట్ల రివార్డ్
అమెరికాలో తొమ్మిదేళ్ల క్రితం భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. దీంతో నిందితుడిపై.. ఎఫ్బీఐ (FBI) తాజాగా భారీ రివార్డును ప్రకటించింది. అతడి ఆచూకి చెప్పినవారికి 2,50,000 డాలర్లు (రూ.2.1కోట్లు) ఇస్తామని వెల్లడించింది.