School Funds: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!!

మధ్యప్రదేశ్‌లో స్కూల్ నిధులు పక్కదారి మళ్లించారు. కాంట్రాక్టర్, స్కూల్ ప్రిన్సిపల్ కలిసి పెయింటింగ్ పనులు చేయించామని రూ. లక్షల బిల్లులు మాయం చేశారు. ఈ బిల్లు స్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ షాకింగ్ ఘటనతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడకు 4 లీటర్ల పెయింట్ వేయడానికి 168 మంది కార్మికులు, 65 మంది మేస్త్రీలను తీసుకొచ్చినట్లు బిల్లు వేయించారు. దీనికోసం రూ.1.07 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం నుంచి బిల్లు ఎత్తారు. నిపానియా గ్రామంలో మరొక పాఠశాలలో 10 కిటికీలు, 4 తలుపులకు 20 లీటర్ల రంగులు వేయడానికి 275 మంది కూలీలను నియమించినట్లు ఫేక్ బిల్లు క్రియేట్ చేశారు. దీంతో రూ. 2.3 లక్షలు ఖర్చు అయినట్లు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకున్నాడు. ఈ బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సొమ్ము ఇంతలా దుర్వినియోగం అవుతుందా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!

Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

Missuse Of School Funds

Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!

ఈ పనిని నిర్వహించిన నిర్మాణ సంస్థ సుధాకర్ కన్‌స్ట్రక్షన్ మే 5, 2025న ఒక బిల్లును తయారు చేసింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ దీనిని- ఏప్రిల్ 4న కళ్లు మూసుకొని పాస్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మార్పాచి మాట్లాడుతూ.. ఈ రెండు పాఠశాలల బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై దర్యాప్తు జరుగుతోంది, బయటపడిన వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

viral | school funds | Madhya Pradesh | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు