China-America: అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ మ్యాటర్‌ లో జాగ్రత్త..చైనా హెచ్చరికలు

చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్‌ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్‌ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాల నుంచి బయటపడేందుకు అనేక దేశాలు అగ్రరాజ్యంతో బిజీబిజీగా చర్చలు జరుపుతున్నాయి. అయితే టారిఫ్‌ ల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్‌ సర్కారు షరతు పెట్టింది. ఈ వార్తల పై తాజాగా బీజింగ్‌ తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Yemen-America: యుద్ధ ప్రణాళిక రహస్యాలు ఇంట్లో చెప్పిన అమెరికా రక్షణ మంత్రి!

ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్నిఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది.

Also Read: Bollywood:లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి మరో హీరో ను చంపేస్తామంటూ బెదిరింపులు!

ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం..పులి చర్మం కోసం దాంతోనే డీల్‌ చేసుకోవడం లాంటిది. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళ్తే..అది ఎప్పటికైనా మనకే హాని  చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు.రాజీ పడితే గౌరవం లభించదు అని చైనా తమ ప్రకటనలో హెచ్చరించింది.

ఏప్రిల్‌ 2 న ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పై భారీ టారిఫ్‌ లు విధించిన ట్రంప్..వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.  అయితే చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. ఇదే సమయంలో ఆ దేశాల్లో బీజింగ్‌ కంపెనీల ఏర్పాటును కూడా తిరస్కరించాలని షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైనా ఉత్పత్తుల పై అమెరికా 145 శాతం టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా అగ్రరాజ్యం పైనా బీజింగ్‌ 125 శాతం టారిఫ్‌ లను ప్రకటించింది.దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది.

Also Read: Karnataka EX DGP Murder Case: మాజీ డీజీపీని చంపేసిన తరువాత ఆయన భార్య ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా..బిగ్‌ ట్విస్ట్‌..!

Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

china | trump | latest-news | telugu-news | international-news | international news in telugu | international news telugu | latest-international-news | donald trump tariffs | tariff tax | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు