/rtv/media/media_files/2025/04/16/u9TTgLqZ4r1APxEYCjwh.jpg)
Trump Vs Harvard: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2బిలియన్ డాలర్ల ఫెడరల్‌న నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు,కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: China-America: అమెరికాతో ట్రేడ్ డీల్ మ్యాటర్ లో జాగ్రత్త..చైనా హెచ్చరికలు
ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.వైట్‌హౌస్(White House) గత శుక్రవారం జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ చర్యల పై ట్రంప్ యంత్రాంగం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వై్ హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.
Also Read: Yemen-America: యుద్ధ ప్రణాళిక రహస్యాలు ఇంట్లో చెప్పిన అమెరికా రక్షణ మంత్రి!
హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్‌హౌస్ పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే.విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి ఉద్దేశించినవి అవి. అయితే వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల అక్రమ,హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాలఅర్హతనురద్దు చేస్తామని హెచ్చరించింది.
విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ బుధవారం వర్సిటీకి లేఖ రాశారు.ఈ నెల 30 వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు.ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే..విద్యార్థులు ఎక్స్ఛేంజ్ విజిటర్ కార్యక్రమం ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై హార్వర్డ్ స్పందించింది.
ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం.మా స్వాతంత్య్రం ,రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం.మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు.
Also Read: Bollywood:లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో హీరో ను చంపేస్తామంటూ బెదిరింపులు!
trump | harvard university | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates