Congress Leaders: కాంగ్రెస్ పార్టీలో ట్రంప్ పెట్టిన గొడవ.. రాహుల్ గాంధీ Vs శశి థరూర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు.

New Update
trump rahul gandhi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు. ఈ భిన్న వాదనలు కాంగ్రెస్ వైఖరిపై కొత్త చర్చను రేకెత్తించాయి.

తాజాగా, భారత్ ఆర్థిక వ్యవస్థ "డెడ్ ఎకానమీ"గా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ, రాహుల్ గాంధీ ట్రంప్ చెప్పింది నిజమేనని, దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

Also Read :  రష్యాపై విరుచుకపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. చమురు, ఆయుధ నిల్వలపై దాడులు

Trump Comments On Indian Economy

అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించిన శశి థరూర్, రాహుల్ గాంధీతో విభేదించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, "ఇది వాస్తవం కాదు, భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు" అని పేర్కొన్నారు. ఒకవైపు పార్టీ అగ్రనేతగా రాహుల్ గాంధీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వగా, మరోవైపు సీనియర్ ఎంపీగా శశి థరూర్ మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా లేదని చెప్పడం గమనార్హం. అలాగే ఏఐ కూడా భారత్ ఎకానమి బ్రహ్మడంగా ఉందని చెప్పింది. 

ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ఇటీవల కొన్ని అంశాలపై శశి థరూర్ పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించారనే వార్తల నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీతో ఆయన విభేదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యం దృష్ట్యా కీలకమని, సుమారు 90 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయని థరూర్ తెలిపారు. అమెరికా ఆంక్షలు విధించినా, భారత్ ఇతర మార్కెట్లను అన్వేషించగల సామర్థ్యం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ భిన్నమైన అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Also Read :  ఆ పిండం వయసు 30 ఏళ్లు..

congress-party | latest-telugu-news | indian-economy | 47th us president donald trump | Rahul Gandhi | shashi-tharoor | mp-shashi-tharoor | telugu-news | Donald Trump | international news in telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు