PM Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
కాంగ్రెస్లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ ప్రధాని మోదీ, సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని పొగడంతో కాంగ్రెస్ ఆయన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శశిథరూర్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఓ ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. పని ప్రదేశాల్లో ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండాలని, వారానికి 5 రోజులు మాత్రమే పని ఉండాలని.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు.
మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని అన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లభించనందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలను చేశారు.
అయోధ్య రామాలయం ఫొటోతో బండి సంజయ్ ప్రచారం చేయడంపై.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తు్న్నారంటూ శశిథరూర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. అవి ఫిబ్రవరిలో పంచిన ఫొటోలంటూ బండి సంజయ్ బదులిచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి దిగిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు ఓ పుట్టినరోజు వేడుకలో దిగినవంటూ తెలిపారు. కొందరు కావాలనే దురుద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను ఎడిట్ చేశారంటూ పేర్కొన్నారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. కేవలం వ్యక్తిగతంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ మద్దతుదారులపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్తో కలిసి ఆమె షాంపైన్, సిగరేట్ తాగుతున్నట్టు ఫొటోలకు ఫోజులు ఇస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. శశిథరూర్కు మోయిత్రా మధ్య ఏదో ఉందంటు పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే అది కేవలం ఫొటోలకు ఇచ్చిన ఫోజులు మాత్రమేనని.. తనకు సిగరేట్ అలర్జి ఉందని మోయిత్రా ట్వీట్ చేశారు.