/rtv/media/media_files/2025/08/03/ukraine-drone-attack-2025-08-03-08-19-43.jpg)
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. రష్యాలోని పలు ముఖ్యమైన సైనిక, చమురు స్థావరాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల్లో కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలు, ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులు జరిపింది. రష్యాకు ఉక్రెయిన్ బిగ్‌షాక్ ఇచ్చింది. రష్యా ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ డ్రోన్‌తో పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. రష్యన్ సైనిక అవసరాలకు ఇక్కడి నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. మిలిటరీ ఎయిర్‌బేస్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్‌పై దాడి చేసింది.
Ukraine drone attack caused an explosion at a Russian oil refinery, over 500 miles from the front lines of the war.
— Brando Republic (@BrandoRepublic) August 2, 2025
This war isn’t ending anytime soon. pic.twitter.com/5xIv0DU96f
Also Read : బలూచిస్తాన్‌లో భీకరమైన దాడి.. పాక్ సైనికులు 10 మంది మృతి
Ukrainian Drone Strikes
పశ్చిమ దేశాల ఆయుధ సహాయంతో ఉక్రెయిన్ రష్యాలో లోపలికి చొచ్చుకువెళ్లి దాడులు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ దాడుల్లో ముఖ్యంగా రియాజాన్ ఆయిల్ రిఫైనరీ, అన్నానెఫ్టెప్రొడక్ట్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రిమోర్స్కో-అఖ్తార్స్క్‌లోని సైనిక విమానాశ్రయం మరియు పెన్జాలోని ఎలక్ట్రోప్రిబోర్ ఫ్యాక్టరీ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు, సైనిక సామర్థ్యానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది.
ఈ డ్రోన్ దాడుల వల్ల ముగ్గురు రష్యా పౌరులు మృతి చెందినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమారా ప్రాంతంలో ఒక వృద్ధుడు డ్రోన్ శకలాలు పడటంతో మరణించగా, పెన్జాలోని ఎలక్ట్రోప్రిబోర్ ఎలక్ట్రానిక్స్ ఫెసిలిటీలో ఒక మహిళ, రోస్టోవ్ ప్రాంతంలోని ఒక పారిశ్రామిక కేంద్రంలో ఒక సెక్యూరిటీ గార్డు మరణించారు. ఈ దాడుల అనంతరం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తాము 112 ఉక్రెయిన్ డ్రోన్‌లను అడ్డుకున్నామని పేర్కొంది. అయితే, వాటిలో కొన్ని లక్ష్యాలను చేధించి భారీ విధ్వంసం సృష్టించగలిగాయని వెల్లడైంది.
ఉక్రెయిన్, రష్యాపై దాడి చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగించడం ఇప్పుడు ఒక కీలకమైన వ్యూహంగా మారింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థను పెంచుకోవడమే కాకుండా, రష్యాకు ఆర్ధికంగా, సైనికంగా నష్టం కలిగించేందుకు డ్రోన్ దాడులను ఒక ప్రధాన సాధనంగా వాడుకుంటోంది. రష్యా కూడా దాడులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ దాడుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోతోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రోన్ దాడులు కొనసాగే అవకాశం ఉందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కొత్త దశకు దారితీస్తాయని భావిస్తున్నారు.
Also Read : నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్...వారికి రెడ్ సిగ్నల్
attack on Russia | latest-telugu-news | kyiv drone attack | telugu-news | international news in telugu