/rtv/media/media_files/2025/08/02/that-fetus-is-30-years-old-2025-08-02-20-19-49.jpg)
That fetus is 30 years old.
30 Year Old Embryo : సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువుకు ఎంతవయసు ఉంటుంది. మా అంటే ఒకరోజు. కానీ ఇక్కడ కనిపిస్తు్న్న శిశువు వయసు అక్షరాల 30 సంవత్సరాలు. అవును మీరు చదివింది నిజమే. అదేంటి అప్పుడే పుట్టిన శిశువుకు 30 సంవత్సరాలు ఏంటీ అని అశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఆ శిశువు పేరు చెప్పనేలేదు కదూ! పేరు హాడియస్ డేనియల్ పియర్స్. డేనియస్ మనలా సాధారణ జననం కాదు. వైద్యశాస్త్రంలోనే ఒక అరుదైన ఘటన. ఆ శిశువు పుట్టుకవెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం...
ఇది కూడా చదవండి: బెంగళూరులో విషాదం.. 13 ఏళ్ల బాలుడు దారుణ హ*త్య
అమెరికాకు చెందిన లిండా ఆర్కెడ్ అనే మహిళ 1992లో నాలుగు ఎంబ్రియో (గర్భస్థ పిండం)లను ఫ్రీజ్ చేయించుకుంది. తనకు అవసరం అయినపుడు బిడ్డలను కనాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా తనకు అవసమైన సందర్భాల్లో నాలుగు పిండల్లో మూడింటిని వినియోగించుకుంది. ఇక తన వద్ద ఉన్న మరో పిండాన్ని ఎవరికైనా ధానం చేయాలనుకుంది. దానితో నాటి నుంచి కూడా ఆ పిండం లిండా ఆర్కెడ్ కడుపులోనే ఉండిపోయింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత లిండ్సే, టిమ్ పియర్సేల జంట ఆ పిండాన్ని వాడుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ జంటకు సాధారణంగా బిడ్డను కనటంలో సమస్య తతెత్తడంతో తెలిసిన వారి ద్వారా లిండా ఆర్కెడ్ వద్ద పిండం ఉన్నట్లు తెలుసుకుని ఆమెను సంప్రదించారు. లిండా కూడా దానం చేయడానికి అంగీకరించింది. అలా లిండా ఆర్కెడ్ కడుపులో ఉన్న పిండాన్ని ఎంతో జాగ్రత్తగా లిండ్సే కడుపులోకి మార్చారు. దానితో లిండ్సే కడుపులోకి పిండం చేరింది.
2023లో ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత శిశువు అయిన హాడియస్ డేనియల్ పియర్స్.. లిండ్సే కడుపులో పెరిగాడు. కొన్ని నెలల తర్వాత ఈ భూమ్మీదకు వచ్చాడు. పుట్టిన శిశువు సాధారణంగా జన్మించిన పిల్లల్లానే ఇతడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే హాడియస్ డేనియల్ పియర్స్ మాత్రం పుట్టడంతోనే రికార్డు సృష్టించాడు. అదెంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన శిశువుగా రికార్డు సొంతం చేసుకున్నాడు. కాగా గర్బస్థ పిండాన్ని ప్రీజ్ చేయించుకుంటే 30 ఏళ్ల తర్వాత కూడా ఫ్రీజ్ చేసిన పిండం కూడా ఎంతో ఆరోగ్యమైన శిశువు అవ్వగలదని పలువురు వైద్యులు తెలిపారు. అల్ట్రా లో టెంపరేచర్ వద్ద సెల్యూలర్ యాక్టివిటీ నిలిచిపోతుంది. తద్వారా పిండం పాడవ్వటం లేదా వయసు పెరగటం వంటివి జరగవు’ అని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!