Rahul Gandhi: బిహార్ గూండాల రాజ్యంగా మారింది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.