Hyderabad: హైదరాబాద్‌లో ఫేక్ భూపత్రాలు.. ఆరుగురు అరెస్టు

ఫేక్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల దందా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.

New Update
Certificate forgery racket busted, six arrested in Saroornagar

Certificate forgery racket busted, six arrested in Saroornagar

ఈ మధ్యకాలంలో ఫేక్‌ సర్టిఫికేట్ల దందా విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి అక్రమ దందాకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టులు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా భానుప్రకాశ్, సాగరిక దంపతులు.. సాత్విక్ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఓ నోటరీ షాపు నిర్వహిస్తున్నారు.  

Also Read: విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్‌ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!

Certificate Forgery Rocket Busted

అయితే వీళ్లు ఎక్కువ డబ్బుల కోసం అత్యాశపడ్డారు. దీంతో ఫేక్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్‌తో పాటు భూ క్రయవిక్రయాలకు సంబంధించిన నకిలీ డాక్యమెంట్లు, ఫోర్జరీ పత్రాలు సృష్టించడం ప్రారంభించారు. దీనికోసం నిందితులు మరికొందరితో చేతులు కలిపి ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారు. చివరికి ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను అరెస్టు చేశారు. 

Also read: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO

గత తొమ్మిదేళ్ల నుంచి ఈ ఫేక్‌ పత్రాలు సృష్టించే దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. ఒక్కో ఫేక్‌ డాక్యుమెంట్‌ కోసం ఏకంగా రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు ముఠాలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురి కోసం గాలిస్తున్నామని స్పష్టం చేశారు. 

Also Read: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

Also Read: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ

 

police | fake-certificates | fake-certificate | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు