Operation Mahadev: పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన చైనా డివైస్.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది?
జమ్మూకశ్మీర్లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారి, మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను జవాన్లు ఎన్కౌంటర్లో హతమార్చారు. అతనితోపాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు కాల్పుల్లో చనిపోయారు.