BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి కచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని ఎలాంటి సందేహం లేదన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందన్నారు.

New Update
Former- pakistan -high -commissioner -abdul- basit

Former- pakistan -high -commissioner -abdul- basit

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ మధ్య టెన్షన్ వాతావరణ నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. 

Also Read: సంచలన అప్‌డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !

యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతేకాదు సింధు జల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేయడం గురించి ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ నీళ్లు లేకుండా మనుగడ సాగించడం కష్టమవుతుందని అన్నారు. దీనివల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. నదుల్లో నీరు ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుందంటూ చెప్పుకొచ్చారు. 

Also read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

ఇదిలాఉండగా ఇప్పటికే భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఐరన్ డోమ్ టెక్నాలజీని సైతం భారత్‌కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్‌ నిర్వహించడంలో మొసాద్ టీం మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 telugu-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు