/rtv/media/media_files/2025/03/27/hqzQcz3LKVtZvAygLbrQ.jpg)
putin Photograph: (putin )
ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్ చాలాసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
Also Read:పాక్‌కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు
యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటం పై ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల పై రష్యా సైన్యం దాడులు జరపడం చూస్తుంటే పుతిన్ కు యుద్ధం ఆపడం ఇష్టం లేదని అనిపిస్తోందన్నారు.
Also Read: Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
అనేక మంది చనిపోతున్నారని,మాస్కో పై మరిన్ని ఆంక్షల పై ఆలోచించక తప్పదన్నారు.రోమ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయిన తరువాత సొంత సోషల్ మీడియా వేదిక పై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. అంతకుముందు రష్యాకు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్..క్రిమియా రష్యాతోనే ఉంటుందని అన్నారు.
ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ త్వరలో అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. మరో వైపు భీకర దాడులను ఆపాలని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్ కు చెప్పిన కొన్ని గంటల్లోనే మాస్కో నుంచి సానుకూల స్పందన రావడం మరో విశేషం.
Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
putin | russia | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | ukrain | trump | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates