/rtv/media/media_files/2025/04/17/yaPpD3JbfxogoToAiuPY.jpg)
Pakistan army chief Asim Munir
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందని పేర్కొన్న భారత్..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్ నేతలు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు.
Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.
వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాక్ మిలిటరీ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్ ఇదే విధంగా మాట్లాడారు.
మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.
పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు. అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.
Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates