/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t071444325-2025-11-07-07-15-38.jpg)
Bomb threat calls... If you cut it, you'll be a failed lover
ప్రేమ ఎంతటి పనినైనా చేపిస్తుంది. ప్రేమ కోసం, ప్రేమికురాలికోసం నేరస్తులుగా మారిన వారు అనేక మంది ఉన్నారు. ప్రేమ విఫలమై ప్రాణత్యాగం చేసినవారూ ఉన్నారు. కానీ, ఓ యువతి తన ప్రేమ విఫలం(love-failure) కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చివరికి కటకటాల పాలైంది. వివరాల ప్రకారం.. గుజరాత్(gujarat) కు చెందిన రెని జోలిల్డా(30) బీఈ-ఎలక్ట్రానిక్ విద్య పూర్తి చేసింది. ప్రస్తుతం ఓ ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగం చేస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న జోలిల్డా ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ, ఆ యువకుడు ఆమె ప్రేమను నిరాకరించాడట. దీంతో ఆమె మానసికంగా ఎంతో బాధపడింది. ఆ బాధ నుంచి అతనిపై కసి పెరిగింది. ఎలాగైన అతన్ని బదునాం చేయాలనుకుంది.
Also Read : కాలుకు చుట్టుకున్న నాగుపాము.. కొరికి కొరికి ముక్కలు చేసిన యువకుడు
Bomb Threat Calls
తన ప్రేమికుడి మీద కసితో అతని పేరిట పలు ఇంటర్నేట్ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలకు మెసేజ్‌లు పంపడం చేసింది. అది కూడా ఆయా పాఠశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపులు(bomb-threat-call), హెచ్చరికల మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ఎత్తుగడ. ఆయన పేరిట అంతర్జాల అకౌంట్ల నుంచి గుజరాత్ కేంద్రంగా బెదిరింపులకు తెగించింది.ఇలా జూన్ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. అలా.. అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ క్రికెట్ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరించింది. అయితే కేసు విచారణ చేపట్టిన బెంగళూరు ఉత్తర విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ అకౌంట్ ను గుర్తించి ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ విలేకరులకు వివరించారు.
కాగా గతంలోనే అహ్మదాబాద్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాగా, బెంగళూరు(bengaluru) కేసులకు సంబంధించి ఆమెను విచారించడానికి బాడీవారెంట్‌పై గురువారం బెంగళూరుకు తీసుకువచ్చారు. ఆమె గుజరాత్ నుంచే బెంగళూరు నగర పాఠశాలలు, కళాశాలలకు ఈమెయిల్ ద్వారా ‘బాంబు బెదిరింపు’లకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.కాగా ప్రాథమిక విచారణలో ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె అంగీకరించిందని కమిషనర్ వివరించారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు.
Also Read: Vijay - Rashmika: బిగ్ న్యూస్.. విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్! వైరలవుతున్న పోస్ట్
Follow Us