/rtv/media/media_files/2025/11/06/hardoi-man-bites-cobra-2025-11-06-18-10-47.jpg)
Hardoi Man Bites Cobra
యూపీ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఊహించని పని చేశాడు. తనను కాటు వేసిన పామును నోటితో ముక్కలు ముక్కలు కొరికాడు. ఆపై హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేసి రక్షించారు. ఇంతకీ ఏం జరిగిందో అనే విషయానికొస్తే..
Hardoi Man Bites Cobra
హర్దోయ్ జిల్లా తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భడాయల్ గ్రామం మజ్రా పుష్పతాలికు చెందిన 28 ఏళ్ల పునీత్ నవంబర్ 4న తన పొలంలో పనిచేస్తున్నాడు. అదే సమయంలో మూడు నుంచి నాలుగు అడుగుల పొడవున్న నల్లటి నాగుపాము అతడి కాలుకు చుట్టుకుని కాటేసింది. అది గమనించిన ఆ యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తర్వాత ఏ మాత్రం భయపడకుండా సాహసం చేశాడు. వెంటనే ఆ కోబ్రా పామును పట్టుకుని.. కోపంతో దాని తలను కొరికేశాడు. ఆ యువకుడు చేసిన పనికి పాము తల, మొండెం వేరు వేరుగా పడిపోయింది.
అనంతరం ఆ యువకుడు జరిగిన విషయాన్ని చుట్టు పక్కల వారికి తెలియజేశాడు. ఈ విషయం కాస్త అతడి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఒక రాత్రి ట్రీట్మెంట్ అందించిన తర్వాత మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై డాక్టర్ షేర్ సింగ్ మాట్లాడుతూ.. యువకుడి కాలిపై పాముకాటు గుర్తులు ఉన్నాయి. అయితే పేషెంట్ చేసిన పని మాత్రం చాలా ప్రమాదకరమైనది. నల్లటి కోబ్రా పడగను నోటితో కొరికినపుడు.. అది అతడి నోటిలో కాటు వేసినా లేదా దాని విషం నోటిలోకి వెళ్లినా.. అతడి ప్రాణాలను రక్షించడం కష్టంగా మారేది అని చెప్పుకొచ్చారు.
పేషెంట్ పునీత్ మాట్లాడుతూ.. ‘‘నేను వరి పొలానికి వెళ్లాను. అక్కడ కోబ్రా పాము కనిపించింది. అది నా కాలుకు చుట్టుకుంది. అది నన్ను కాటు వేసింది. ఆ తర్వాత నా నోటితో పాము పడగను కొరికేశాను. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రిలో రాత్రంతా ఉన్నాను. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది. ఏమీ అనిపించడం లేదు.’’ అని చెప్పుకొచ్చాడు.
Follow Us