India and Pakistan war : కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!

భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సైనిక చర్యలను నిలిపివేశామని తేల్చి చెప్పారు.  

New Update
Vikram Misri

Vikram Misri

Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.  ఈ విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియా టుడే ఒక కథనంలో తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సైనిక చర్యలను నిలిపివేశామని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది.  

lso Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

“ట్రంప్ కనీసం ఏడుసార్లు కాల్పుల విరమణకు దోహదపడ్డానని బహిరంగంగా చెప్పుకున్నారు. ఈ అంశంపై భారతదేశం ఎందుకు స్పందించలేదు?” అని పార్లమెంట్ ప్యానెల్‌లోని ఒక సభ్యుడు ప్రశ్నించారు. ముఖ్యంగా ట్రంప్ తన ప్రకటనలలో కశ్మీర్‌ను ప్రస్తావిస్తూనే ఉన్నారని మరో సభ్యుడు సూటిగా ప్రశ్నించారు. దీంతో తమ చొరవతోనే భారత్-పాక్ కాల్పుల విరమించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని మిస్త్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చలు జరిగిన అనంతరమే మిలటరీ యాక్షన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మిస్రీ తెలిపారు. భారతదేశం- పాకిస్థాన్ కాల్పుల విరమణ ద్వైపాక్షిక నిర్ణయం అని, మరే ఇతర దేశ ప్రమేయం లేదని పేర్కొంటూ విదేశాంగ కార్యదర్శి ఈ వాదనలను తోసిపుచ్చారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. “యుద్ధ విరమణ ఒప్పందంలో అమెరికా ఎటువంటి పాత్ర పోషించలేదు” అని మిస్రీ ప్యానెల్‌కు వివరణ ఇచ్చారు. 

Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

 ఇంకా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు దాడికి ముందు, ఆ తర్వాత పాక్‌తో సమాచారం పంచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కూడా విక్రమ్ మిస్రీ ప్యానెల్‌కు ఆయన తెలియజేశారు. ఉగ్రవాదులుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన పలువురు పాకిస్థాన్ నుంచి నిరంతరం ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, భారత్‌ పై బహిరంగంగానే హింసను రెచ్చగొడుతున్నారని, ఇది భద్రతా ఆందోళనకు కారణమవుతోందని వివరించారు.

Also Read :  ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు!

కాగా భారత్- పాకిస్థాన్ మధ్య వివాదం సంప్రదాయ యుద్ధ పరిధిలోనే సాగిందని, ఇస్లామాబాద్ నుంచి ఎటువంటి అణ్వాయుధ దాడులకు సంబంధించిన అనుమానిత సంకేతాలు రాలేదని కూడా విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే, చైనా మూలాలున్న సైనిక హార్డ్‌వేర్‌  పాకిస్థాన్‌ ఉపయోగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన విక్రమ్ మిస్రీ.. “వారు ఏమి ఉపయోగించినా పర్వాలేదు. మనము వారి వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాం అని దృఢంగా చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో యుద్ధ సమయంలో కోల్పోయిన భారతీయ విమానాల సంఖ్యను వెల్లడించడానికి మిస్త్రీ అంగీకరించలేదు. ఇది జాతీయ భద్రతా సమస్యకు సంబంధించినది పేర్కొంటూ వ్యాఖ్యానించలేదు.

Also Read :  పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్‌ నుంచి భారత్‌ ఔట్

ఆపరేష్ సింధూర్'పై విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) సోమవారంనాడు కలుసుకుని వివరణ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య మిలటరీ చర్యలు, తదనంతర పరిణామాలను కమిటీకి తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన జరిగిన ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, దీపేంద్ర హుడా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి, అరుణ్ గోవిల్ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కోవాలనే భారతదేశ సంకల్పాన్ని ప్రపంచ నాయకులకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 ప్రపంచ రాజధానులకు అఖిలపక్ష ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించింది.

Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు