/rtv/media/media_files/2025/05/19/ly0tggqKOWtxkdrfEwuc.jpg)
Telangana CM Revanth launches 'Indira Sauragiri Jal Vikasam'
'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు.
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2025
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు… https://t.co/yDvYlAl9yW pic.twitter.com/F7dgGrdM6V
వంద రోజుల్లో సోలార్ పంపుసెట్లు..
ఈ మేరకు ఇక 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకంపై లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సీఎం అన్నారు. సోలార్ పంపుసెట్లతోపాటు పొలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిసర ప్రాంతాల గిరిజనులకు లబ్ధిదారులు పథకంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని, విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
Also Read : భారీ బాంబు పేలుడు.. స్పాట్‌లోనే నలుగురు
ఐటీడీఏ పరిధిలోని జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ హక్కుల చట్టం 6.69 లక్షల ఎకరాలకుగానూ మొత్తం 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు అందించారు. విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయగా.. గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్‌వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే 25లోపు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తిస్తారు. జూన్ 10లోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి భూగర్భ జలాల సర్వే తదితర పనులను గిరిజన సంక్షేమశాఖ చేపడుతుందని అధికారులు తెలిపారు. జూన్ 25 నుంచి 2025 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పనులను పూర్తి చేయనున్నారు. ఇక మొదటి ఏడాది 10 వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
Also Read : మాయలేడి జ్యోతి.. పాక్ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం
today telugu news | mahabubnagar | batti-vikramarka