Hari Hara Veera Mallu 3rd Song
Hari Hara Veera Mallu 3rd Song:
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్(Hari Hara Veera Mallu 3rd Song Update) ఇచ్చారు మేకర్స్. 3rd సింగిల్ లిరికల్ వీడియో "అసుర హననం"(Asura Hananam 3rd Song Hari Hara Veera Mallu) పాటను మే 21, ఉదయం 11:55 కు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!
#HariHaraVeeraMallu in cinemas from 12th June ⚔️💥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 19, 2025
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 @Manojdft @Cinemainmygenes @gosala_lyricist @tipsofficial @kumartaurani @tipsregional @MegaSuryaProd @HHVMFilm pic.twitter.com/VkOPvEhfvn
రీసెంట్ గా 'హరి హర వీర మల్లు' సినిమా 2025 జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ 3rd సింగిల్ అప్ డేట్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఆధారంగా రూపొందించారు.
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
గతం లో సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ.. “చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన పాటలు, పవర్ఫుల్ ట్రైలర్ను త్వరలో విడుదల చేయనున్నాం,” అని వెల్లడించారు.
Also Read: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
ఈ చిత్రం మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో మే 9 విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, షూటింగ్ పెండింగ్ ఉండటంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అయితే, ఎట్టకేలకు జూన్ 12న విడుదల ఫిక్స్ చేసుకున్నాడు వీరమల్లు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డబ్బింగ్, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జోరుగా కొనసాగుతోంది.
బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.