Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నేడు పార్లమెంట్‌లో హై టెన్షన్

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు నేడు నుంచి ప్రారంభం కానున్నాయి. అజెండాలో ప్రధానంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక్కటే లిస్ట్ చేయబడి ఉండటంతో, ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ సాగే అవకాశం ఉంది.

New Update
Speaker Om Birla

Speaker Om Birla

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు నేడు (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజే సభలో రాజకీయ సెగలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి అజెండాలో ప్రధానంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(lok-sabha-speaker-om-birla) పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక్కటే లిస్ట్ చేయబడి ఉండటంతో, ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ సాగే అవకాశం ఉంది.

ఈ తీర్మానంలో అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. స్పీకర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఓటింగ్ జరిగే పక్షంలో సభలో తీవ్ర ఉత్కంఠ నెలకొననుంది.

Also Read :  గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు!

చర్చకు రానున్న కీలక అంశాలు

కేవలం స్పీకర్(loksabha-speaker) అంశమే కాకుండా, అంతర్జాతీయ, దేశీయ పరిణామాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు:

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: ఇరాన్‌పై యుద్ధం మరియు అక్కడ పెరుగుతున్న అశాంతి.
చమురు రాజకీయాలు: రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘అనుమతి’ ఇచ్చారన్న అంశంపై విపక్షాల ప్రశ్నలు.
ధరల పెరుగుదల: నిత్యావసరాల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది.
విద్యుత్తు సవరణ బిల్లు: సమయం మిగిలితే ఈ కీలక బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also Read :  కేంద్రం బంపరాఫర్.. లోగో డిజైన్‌ చేస్తే రూ.50 వేలు

వ్యూహ ప్రతివ్యూహాలు

సభలో టీఎంసీ సభ్యులు 'సర్‌' అంశాన్ని లేవనెత్తితే, దానికి ప్రతిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటోకాల్‌ ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చి విపక్షాలను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. మొత్తానికి, బడ్జెట్‌ సమావేశాల రెండో భాగం మొదటి రోజు నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదిక కానుంది.

Advertisment
తాజా కథనాలు