VB G RAM G Act: కేంద్రం బంపరాఫర్.. లోగో డిజైన్‌ చేస్తే రూ.50 వేలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' పథకం లోగో కోసం పోటీ పెట్టింది. బెస్ట్ డిజైన్‌ను అందించిన విజేతకు రూ.50,000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

New Update
_VB G RAM G Act (1)

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' - VB G RAM G Act పథకం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకోనుంది. ఈ పథకం కోసం ఆకర్షణీయమైన లోగోను రూపొందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్త పోటీని నిర్వహిస్తోంది. బెస్ట్ డిజైన్‌ను అందించిన విజేతకు రూ.50,000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. క్రియేటివిటీ కలిగిన యూత్, డిజైనర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రిత్వ శాఖ కోరింది. మరిన్ని వివరాల కోసం మైగవ్ (MyGov) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

పోటీ నిబంధనలు ఇవే:

ప్రతిబింబం: లోగో డిజైన్ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, జీవనోపాధిని ప్రతిబింబించేలా సృజనాత్మకంగా ఉండాలి.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?: ఆసక్తి గల అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.mygov.in/ లో లాగిన్ అయ్యి తమ ఎంట్రీలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు మార్చి 20వ తేదీ వరకు గడువు ఉంది.

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ 

గతంలో అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ జీరామ్‌జీ బిల్లు-2025ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కూలీలకు గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.

Advertisment
తాజా కథనాలు