Non Veg: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరం తేలికైన, చల్లని ఆహారాన్ని కోరుకుంటుంది. అలాంటి సమయంలో ఎక్కువగా మాంసాహారం తినడం అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. సాధారణంగా మటన్, చికెన్, చేపలు వంటి నాన్-వెజ్ ఆహారాలు ప్రోటీన్, కొవ్వుతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్కువ కాలంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారాలైనా.. వేసవిలో ఇవి జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా జీర్ణవ్యవస్థ మందగించడమే దీనికి కారణం.
Also Read : గుండె ఆరోగ్యం మీ ముఖం చెబుతుందా..? ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోండి
దీర్ఘకాలికంగా అనేక సమస్యలు:
ఈ సీజన్‌లో ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం, కడుపులో బరువు వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. మాంసాహారం తినడం తాత్కాలికంగా రుచికరంగా అనిపించినా.. దీర్ఘకాలికంగా ఇది అనేక సమస్యలకు దారితీయొచ్చు. ముఖ్యంగా వేయించిన, మసాలా ఎక్కువగా ఉండే నాన్-వెజ్ వంటకాలు మరింత హానికరం. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచి చెమటలు, తల తిరుగుడు, అలసట, చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సొరకాయతో స్వర్గంలాంటి ఆరోగ్యం.. ఈ రసంతో అంతులేని శక్తి
వేసవిలోనే నీటి కొరత ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్‌కి గురి అవుతారు. దీనికి తోడు నాన్-వెజ్ జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఈ సమయంలో నాన్-వెజ్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గి తలనొప్పి, బలహీనత, మూత్రంలో మంట, రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాలు అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలతోపాటు ఊబకాయం వస్తుంది. వేసవిలో నాన్-వెజ్ ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. తేలికైన, తక్కువ మసాలా కలిగిన వంటకాలు, నీరు తాగడం, పండ్లు, కూరగాయలను జీర్ణాశయాన్ని తేలికపరచే ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : స్నానం సమయంలో మూత్ర విసర్జన చెయ్యడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పండ్లను సరైన రీతిలో తినటం వలన రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు
(non-veg | non-veg-recipes | health-benefits-of-avoiding-non-veg | biryani-with-non-veg | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)