Heart Problem
Heart Problem: నేటి ఆధునిక యుగంలో వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుతనం లోపించడం వంటి అంశాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. చాలామంది గుండె సంబంధిత సమస్యలను ఛాతీ నొప్పి, ఊపిరాడకపోవడం వంటి ప్రాథమిక లక్షణాలతోనే గుర్తిస్తారు. కానీ నిజానికి గుండె ఆరోగ్యం బాగాలేకపోతే అది ముందుగా ముఖం, చర్మం మీదే కొన్ని సంకేతాలను చూపిస్తుంది. ఈ సంకేతాలను గుర్తించగలగడం వల్ల ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. చర్మంపై కనిపించే కొన్ని మార్పులు గుండె సమస్యల తొలి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. కళ్ల చుట్టూ పసుపు, నారింజ రంగు మచ్చలు, అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. ఇది గుండె నాళాల్లో కొవ్వు చేరి వాటిని మూసివేయడానికి దారితీసే ప్రమాదాన్ని సూచిస్తుంది.
Also Read : పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?
గుండె సమస్యల గురించి..
అలాగే వేళ్లకు, గోళ్లకు, పెదవులకు నీలం లేదా ఊదా రంగు రావడం రక్తంలో ఆక్సిజన్ సరైన స్థాయిలో లేకపోవడం, గుండె రక్తాన్ని సరైన విధంగా పంపక పోవడం వల్ల కావచ్చు. ఇదే విధంగా పాదాలు, చేతులు, చీలమండల వాపు గుండె బలహీనత లక్షణం కావచ్చు. గుండె పూర్తిగా రక్తాన్ని పంపలేకపోయినప్పుడు ద్రవం ఒత్తిడితో ఆయా భాగాల్లో చేరుతుంది. అలాగే చర్మంపై కనిపించే వలలాంటివి ముఖ్యంగా నీలం, ఊదా రంగులో రక్త ప్రసరణలో ఆటంకానికి సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో, గోర్లుపైకి లేచినట్టు గుండ్రంగా మారడం గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యల సంకేతంగా చెబుతారు.
ఇది కూడా చదవండి: సహజంగా జీవక్రియను మెరుగుపర్చే రహస్య శక్తి
ముఖం, శరీరం సుదీర్ఘకాలం మాంద్యంగా ఉండి పాలిపోవడం రక్తహీనతకు సంకేతంగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు, దద్దుర్లు గుండె కవాటాల సమస్యకు, రక్తనాళాల వాపుకు సూచనలుగా చెబుతారు. ఈ విధంగా శరీరం, ముఖం ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా గుండె సమస్యల గురించి హెచ్చరిస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ఎంతో అవసరం. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండె ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వలన గుండె సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : India Pakistan War: భారత్-పాక్ యుద్ధం.. ఇతర దేశాలకు ఆయుధాల వ్యాపారం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్నానం సమయంలో మూత్ర విసర్జన చెయ్యడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి
( heart-problem | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)