/rtv/media/media_files/2025/05/15/BLEcKaQjS5023UboqiQX.jpg)
Bottle Gourd Juice
Bottle Gourd Juice Health Benefits: సొరకాయ రసం ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఒక సహజమైన ఔషధం. పిల్లలతో పాటు పెద్దలూ తరచూ సొరకాయను తినడానికి ఇష్ట పడరు. ఈ కూరగాయలో దాగి ఉన్న పోషకాల శక్తి అంతులేనిది. గుమ్మడికాయ(Pumpkin) తరహాలో రుచిగా ఉండే సొరకాయ.. ఆయుర్వేదంలో(Ayurveda) ఆరోగ్య వరంగా చెబుతారు. ఇందులో విటమిన్ సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలతోపాటు 92% నీరు ఉంటుంది. ఈ గుణాల వల్ల ఇది వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకు, హైడ్రేషన్ కోసం అత్యుత్తమంగా పనిచేస్తుంది. సొరకాయ రసంలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఈ రసం కడుపుని ఎక్కువసేపు నిండినట్లుగా ఉంచుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను(Bad Cholesterol) తగ్గించడంలో..
దీనివల్ల అధికంగా తినే అలవాటు, బరువు పెరగకుండా ఉండటానికి, ఊబకాయం(Obesity) తగ్గించుకోవడానికి, జీర్ణవ్యవస్థకు(Digestive System) మేలు, మలబద్ధకం(Constipation), అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఈ రసం తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన నీటి స్థాయి నిలిపి ఉంచడమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి సొరకాయ రసం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.
Also Read: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
మధుమేహ నియంత్రణలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరం. అలాగే ఇందులో విటమిన్ సి, కె, కాల్షియం వంటి పోషకాలున్నందున.. దేహానికి అవసరమైన శక్తిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సొరకాయ రసం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సాధారణమైన కూరగాయలా కాకుండా దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచి, ఆరోగ్యాన్ని కాపాడే సహజమైన ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: వేసవిలో పీచు పండ్లతో ఆరోగ్యం.. శరీరానికి చల్లదనం, మంచి జీర్ణక్రియ
(bottle-gourd-juice | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)