Urination
Urination: రోజువారీ జీవనశైలిలో స్నానం ఒక ముఖ్యమైన భాగం. శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా, మానసికంగా తాజాదనాన్ని కలిగించే అలవాటు. అలాంటి వాటిల్లో స్నానం చేస్తున్న సమయంలోనే మూత్ర విసర్జన చేయడం ఒకటి. ఇది సాధారణమైన చర్యగా అనిపించవచ్చు. ఈ అలవాటు శరీరంపై అనేక రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ ఒక నియమిత పద్ధతిలో పనిచేస్తుంది. మీరు షవర్‌లో నిలబడి పదేపదే మూత్ర విసర్జన చేయడం వలన మెదడు నీటి శబ్దాన్ని మూత్ర విసర్జన కోసం సంకేతంగా, భవిష్యత్తులో నీటి శబ్దం విన్న ప్రతీసారీ శరీరానికి మూత్ర విసర్జన చేయాలనే ఆలోచన కలగవచ్చు.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. ఇదేం పని అంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
కుళాయి తెరచిన శబ్దం, వర్షం పడే శబ్దం వంటి వాటి వలన కూడా అదే అవసరం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా మూత్రాశయ నియంత్రణ బలహీనమవుతుంది. ఇప్పటికే మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. స్నానం సమయంలో శరీరం సరైన స్థితిలో ఉండకపోవడం మూత్ర విసర్జన పట్ల ప్రతికూల ప్రభావం చూపుతుంది. మహిళలకు నిలబడిన స్థితిలో మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రం పూర్తిగా బయటకు వెళ్లదు. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిలబడిన స్థితిలో శరీరం పూర్తి స్థాయిలో శుద్ధి చెందదు. దీని వలన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: వేసవిలో నాన్-వెజ్ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ అలవాటు శరీరాన్ని, మానసిక స్థితిని దుర్వినియోగానికి దారితీస్తుంది. స్నానం సమయంలో మూత్ర విసర్జన చేయడం అలవాటవ్వడం వలన కొద్దిగా మూత్రం తయారైనప్పుడే మెదడు వెంటనే టాయిలెట్‌కి వెళ్ళమని సంకేతం ఇస్తుంది. దీని వలన వ్యక్తి తరచూ టాయిలెట్‌కి వెళ్లే అవసరం ఉందనే అనుభూతి పొందుతాడు. దీని ప్రభావం రోజువారీ జీవితంపై పడే అవకాశం ఉంది. కాబట్టి స్నానం సమయంలో మూత్ర విసర్జన చేయడం అనేది నియంత్రించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తల మసాజ్ వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు
( agra-urination | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)