/rtv/media/media_files/2024/11/26/HDQuBQPCfRX1t9qT8lk4.jpg)
Anemia
Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు
సరైన ఆహారం తీసుకోకపోవడం..
ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.
Also Read: బ్రో..'లక్కీ భాస్కర్' ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style)