Eggs: కోడి ముందా లేక గుడ్డు ముందా తెలియదు కానీ.. తినే ముందు కడగాలో లేదో మాత్రం తెలుసుకోండి!!

గుడ్లను కడగడం వల్ల గుడ్డు పెంకుపై ఉండే సహజమైన క్యూటికల్, బ్లూమ్ దెబ్బతింటుంది. ఈ పొర దెబ్బతినడం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా సులభంగా గుడ్డులోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
eggs

eggs

గుడ్ల శుభ్రత అనేది తరచుగా చర్చనీయాంశమైన అంశం. గుడ్లు(eggs-for-health) ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ఆహారం. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తిని అందించడానికి వీటిని ఎక్కువగా తింటారు. గుడ్లు ప్రొటీన్, విటమిన్ డి, జింక్ వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే గుడ్లను కడగడం అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది గుడ్లను కడగడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోయి, అవి తినడానికి సురక్షితంగా మారుతాయని నమ్ముతారు. ఇంకొందరు కడగడం వల్ల గుడ్డుపై ఉండే సహజ రక్షణ పొర తొలగిపోయి, అవి కలుషితమయ్యే అవకాశం పెరుగుతుందని అంటారు.

బ్యాక్టీరియా సులభంగా గుడ్డులోకి..

ఫుడ్ కంట్రోల్ (Food Control) నిపుణుల అభిప్రాయం ప్రకారం... గుడ్లను కడగడం వల్ల బ్యాక్టీరియా కాలుష్యం,  గుడ్డు పెంకు సమగ్రతపై కలిగే ప్రభావాలను గురించి వివరిస్తున్నారు. పరిశోధకులు గుడ్లను కడగడం వల్ల గుడ్డు పెంకుపై ఉండే సహజమైన క్యూటికల్ (cuticle), బ్లూమ్ (bloom) దెబ్బతింటుందని కనుగొన్నారు. ఈ పొర దెబ్బతినడం వల్ల సాల్మొనెల్లా (Salmonella) వంటి బ్యాక్టీరియా సులభంగా గుడ్డులోకి ప్రవేశించవచ్చని తేలింది. గుడ్డు యొక్క ఈ బాహ్య పొర బ్యాక్టీరియా నుంచి గుడ్డును రక్షించే సహజ కవచంలా పనిచేస్తుంది. మనం గుడ్లను కడిగినప్పుడు.. ఈ పొర తొలగిపోయి గుడ్డు కలుషితమయ్యే అవకాశం పెరుగుతుంది. అందువల్ల గుడ్లను కడగడం వల్ల ప్రత్యక్ష ప్రయోజనం లేదని అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి: కిచెన్‌లో ఈ రెండు కలిపి నిల్వ చేస్తున్నారా..? నాణ్యత, రుచి దొబ్బింది ఎలానో తెలుసుకోండి!!

గుడ్లపై మురికి లేదా మలం వంటివి ఉంటే.. వాటిని గోరువెచ్చని నీటితో కడిగి వెంటనే ఆరబెట్టాలి. మీరు దుకాణం నుంచి కొనుగోలు చేసిన గుడ్లు శుభ్రంగా ఉంటే.. వాటిని కడగవలసిన అవసరం లేదని చెబుతున్నారు.  గుడ్లను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి, బాగా ఉడికించి తినాలని చెబుతున్నారు. దేశాన్ని బట్టి భిన్న నియమాలు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ వంటి కొన్ని దేశాలలో గుడ్లను తరచుగా కడిగి రిఫ్రిజిరేటెడ్‌గా అమ్ముతారు.. అయితే యూరప్, ఆసియాలో గుడ్లు వాటి సహజ క్యూటికల్‌తో కడగకుండా అమ్ముతారు. గుడ్లను కడగాలా వద్దా అనేది వాటి మూలం, శుభ్రత, నిల్వ పద్ధతులపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: బియ్యం పిండితో మెరిసే చర్మాన్ని పొందండి.. అందుకు ఈ మూడు పద్ధతులు పాటించండి!!

Advertisment
తాజా కథనాలు