Face Pack: బియ్యం పిండితో మెరిసే చర్మాన్ని పొందండి.. అందుకు ఈ మూడు పద్ధతులు పాటించండి!!

బియ్యంలోని పోషకాలు చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి సహజమైన కాంతిని అందిస్తాయి. బియ్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్‌లు, స్క్రబ్‌లు చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటు ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి.

New Update
face-pack

face-pack

నేటి కాలుష్యం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. సరైన నిద్ర లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల ముఖంపై సహజమైన కాంతి తగ్గిపోతుంది. చాలా మంది ఈ సమస్యల కోసం ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతుంటారు. అయితే వాటిలోని రసాయనాలు తాత్కాలికంగా మాత్రమే మెరుపునిచ్చి, దీర్ఘకాలంలో ప్రభావం చూపకపోవచ్చు. మీరు కూడా సహజ పద్ధతుల ద్వారా మెరిసే.. అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే.. ఒక స్పూన్ బియ్యం పిండి అద్భుతమైన పరిష్కారం కాగలదు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బియ్యం పిండి కీలక పాత్ర పోషిస్తుంది. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

బియ్యం పిండి ప్రయోజనాలు:

మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు బదులుగా.. బియ్యం(rice) పిండిని వాడటం చాలా మేలు. బియ్యంలో విటమిన్ బి, ఫెరులిక్ యాసిడ్, అల్లంటోయిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి సహజమైన కాంతిని అందిస్తాయి. బియ్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్‌లు, స్క్రబ్‌లు చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటు ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి. బియ్యం పిండిని ఇంట్లో సులభంగా ఈ మూడు పద్ధతుల్లో ఉపయోగించి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. దీని కోసం బియ్యం పిండి, పాలు, తేనెతో తయారు చేసి ఫేస్ ప్యాక్. 

 ఇది కూడా చదవండి: బెల్లంతో శ్వాస సంబంధిత సమస్యలకు పరిష్కారం.. అది ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!

దీని తయారీ కోసం రెండు చెంచాల బియ్యం పిండి, ఒక చెంచా పాలు, కొద్దిగా తేనె కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై(glowing-skin-packs) చేసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. బియ్యం పిండి, పెరుగు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిచి, ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరం. ఒక గిన్నెలో రెండు చెంచాల బియ్యం పిండి, ఒక చెంచా తేనె, ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మానికి తేమను అందించి, మరింత అందంగా, కాంతివంతంగా మారుస్తుంది. సహజమైన ఈ చిట్కాలను పాటించడం ద్వారా రసాయనాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: కిచెన్‌లో ఈ రెండు కలిపి నిల్వ చేస్తున్నారా..? నాణ్యత, రుచి దొబ్బింది ఎలానో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు