Onions And Potatoes: కిచెన్‌లో ఈ రెండు కలిపి నిల్వ చేస్తున్నారా..? నాణ్యత, రుచి దొబ్బింది ఎలానో తెలుసుకోండి!!

ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రెండూ తేమ, వాయువులకు సున్నితంగా ఉంటాయి. వీటిని కలిపి నిల్వ చేసినప్పుడు.. బంగాళాదుంపల నుంచి విడుదలయ్యే తేమ ఉల్లిపాయలను త్వరగా పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
onions and potatoes

onions and potatoes

భారతీయ వంటగదిలో కచ్చితంగా ఉండే రెండు కూరగాయలు ఉల్లిపాయలు (Onions), బంగాళాదుంపలు (Potatoes) ముఖ్యమైనవి. ఇవి దాదాపు ప్రతి వంటకంలోనూ ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటిని నిల్వ చేసే విషయంలో చాలా మంది ఒకే చోట పెడుతుంటారు. మీరు కూడా ఇదే చేస్తుంటే.. ఆ అలవాటును వెంటనే మానేయాలి. ఎందుకంటే వీటిని కలిపి ఉంచడం వల్ల అవి త్వరగా పాడైపోవడమే కాకుండా... ఆరోగ్యానికి కూడా హాని కలిగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రెండూ తేమ (Moisture), వాయువులకు (Gases) సున్నితంగా ఉంటాయి. వీటిని కలిపి నిల్వ చేసినప్పుడు.. బంగాళాదుంపల నుంచి విడుదలయ్యే తేమ ఉల్లిపాయలను త్వరగా పాడు చేస్తుంది. అలాగే ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే వాయువులు బంగాళాదుంపలను త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. ఈ విధంగా రెండింటి నాణ్యత, తాజాగా ఉండే స్వభావం దెబ్బతింటుంది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా?

ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే ఇథిలీన్ గ్యాస్ (Ethylene gas) కారణంగా బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి (Sprout). ఈ ప్రక్రియ బంగాళాదుంపలలో సోలనిన్ (Solanine), చాకోనైన్ (Chaconine) వంటి విషపూరిత మూలకాలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే బంగాళాదుంపల నుంచి వచ్చే తేమ కారణంగా ఉల్లిపాయలు కూడా త్వరగా మెత్తబడి.. కుళ్ళిపోయి పాడైపోతాయి. దీనివల్ల వాటి తాజాదనం తగ్గి, రుచి, పోషక విలువలు కూడా ప్రభావితమవుతాయి. 

 ఇది కూడా చదవండి: ఇలా పడుకోగానే అలా నిద్ర రావాలంటే.. శరీరంలో ఈ భాగం సహాయపడాలి తెలుసుకోండి!!

ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రెండూ వాటి తాజాదనాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవాలంటే.. వాటిని విడిగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. బంగాళాదుంపలు చల్లగా, చీకటిగా, బాగా గాలి తగిలే ప్రదేశంలో (Well-ventilated area) ఉంచాలి. కానీ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఉల్లిపాయలను పొడిగా, గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ తగలకుండా జాగ్రత్త పడాలి. వీటిని విడిగా నిల్వ చేయడం వల్ల వాటి నాణ్యత మెరుగుపడి ఎక్కువ కాలం రుచికరంగా, పోషకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

 ఇది కూడా చదవండి: ఈ గ్రహాలు మీపై ఆగ్రహించకూడదు అంటే.. స్టీల్ గ్లాస్‌లో నీళ్ళు తాగొద్దు!!

Advertisment
తాజా కథనాలు