Turmeric: పసుపు కాలేయానికి హాని కలిగిస్తుందా..? వైద్యులు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి

పసుపు వంటకు రంగు, రుచి, పోషకాలను ఇస్తుంది. కర్కుమిన్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అధిక మోతాదులో తీసుకునే కర్కుమిన్ సప్లిమెంట్ల విషయంలోనే సమస్య వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

New Update
Turmeric and Liver

Turmeric and Liver

ప్రతి భారతీయ వంటగదిలో ఉప్పులా వాడే సుగంధ ద్రవ్యాల్లో పసుపు ముఖ్యమైనది. ఇది వంటకు రంగు, రుచి, పోషకాలను ఇస్తుంది. అయితే పసుపు (Turmeric) కాలేయానికి (Liver) మేలు చేస్తుందా? లేదా? అనేది చాలా మందికి ఉన్న సందేహం. ఈ విషయంలో డాక్టర్లు ముఖ్యమైన విషయాల గురించి చెబుతున్నారు. ఆయుర్వేదం, వైద్యంలో పసుపు శక్తివంతమైన సూపర్ ఫుడ్‌గా చెబుతారు. ఇందులో ఉండే కర్కుమిన్ (Curcumin) అనే పదార్థానికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.  ప్రతిరోజూ ఆహారంలో పసుపు వాడటం వల్ల కాలేయానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

లివర్‌కు మంచిదా? కాదా?

ప్రతిరోజూ కూరలు, టీ, పాలలో అర టీస్పూన్ నుంచి టీస్పూన్ వరకు పసుపును వాడటం సురక్షితమని, ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కర్కుమిన్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అధిక మోతాదులో తీసుకునే కర్కుమిన్ సప్లిమెంట్ల విషయంలోనే సమస్య వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో, కొన్ని రకాల సప్లిమెంట్లు కాలేయానికి హాని కలిగించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. తీసుకునే మోతాదు, వ్యక్తి జన్యువులు, ఇతర మందుల వాడకం వంటి అంశాలు కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
 
ఇది కూడా చదవండి: పొట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ ప్రోటీన్ ఆహారం తినాల్సిందే!!

పసుపు దీర్ఘకాలిక వాపును తగ్గించి, అనేక వ్యాధుల మూల కారణాలను అరికడుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇది మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. కర్కుమిన్ ధమనుల పనితీరును మెరుగుపరచి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వంటల్లో పసుపు వాడకం సురక్షితం, ప్రయోజనకరం. కానీ అధిక మోతాదులో పసుపు క్యాప్సూల్స్, సప్లిమెంట్లు తీసుకునేవారు.. ముఖ్యంగా కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు సులభ మార్గాలు ఇవే

Advertisment
తాజా కథనాలు